మహానటి సావిత్రికి లలితా జ్యూవెల్లరీ అధినేతకి మధ్య సంబంధం ఏంటి..? ఆమె కారణంగానే ఇన్ని కోట్లు సంపాదించాడా..?

సావిత్రి .. ఇండస్ట్రీలో మహానటిగా ఎదిగిన స్టార్ హీరోయిన్ .. ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం ..చర్చించుకుంటున్నాం.. ఆమెను అభిమానిస్తున్నామంటే ..కారణం ఆమె నటన అని చెప్పుకోక తప్పదు . అప్పట్లో ఎంతో మంది హీరోయిన్స్ ఉండేవారు . కానీ సావిత్రి మాత్రమే టాప్ హీరోయిన్గా ఎదిగింది . దానికి కారణం ఆమెకున్న మొండితనం ..పట్టుదల.. కృషి అని చెప్పుకోక తప్పదు . సావిత్రి అప్పట్లో సినిమాలు నటించే మూమెంట్లోనే లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకునేది . అయితే అప్పుడు వ్యాపారాలు పెద్దగా లేకపోవడంతో ఆమె కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆస్తులు కూడా పెట్టడం విషయం కారణంగానే చేసేది . పలుచోట్ల ల్యాండ్లు ఇల్లులు కొనిపెట్టేసింది .

అలా చాలా చాలా ఇల్లులు కొనిపెట్టిందట . చెన్నైలోని హబీబుల్లా రోడ్డులో మూడు ఇల్లులు ..కొడైకెనాల్లో ఓ ఇల్లు ..హైదరాబాద్లోని యూసఫ్ గూడా లో రెండు ఇల్లులు కొనేసి పెట్టిందట సావిత్రి . ఇవే కాదు ఇంకా ఇంకా చాలా చాలా చోట్ల ఇల్లులు కూడా పెట్టిందట . కానీ తనతో ఉన్నవాళ్లు మంచిగానే ఆమెను మోసం చేస్తూ వచ్చి ఆస్తులను లాగేసుకున్నారు. అంతేకాదు హబీబుల్లా రోడ్డులో మూడు ఇల్లులు ఉన్నాయి కదా.. వాటిల్లో ఓ పెద్ద బంగ్లా కూడా ఉండేదట .. ఐటీ వాళ్ళ దాడుల్లో దాన్ని సిజ్ చేశారట . దానికోసం చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది అంట ..పోరాడాల్సి వచ్చింది అంట.. ఇదే విషయాన్ని సావిత్రి కూతురు చాముండేశ్వరి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అయితే సావిత్రి అలా ఇల్లు అమ్మేసిన వాటిల్లో ఒక ఇల్లు కొనుగోలు చేశాడు లలిత జువెలర్స్ ఓనర్ కిరణ్ . ఇదే విషయాన్ని చాముండేశ్వరి చెప్పుకొచ్చింది. విజయ్ చాముండేశ్వరి – సోదరుడు కొన్ని ఇల్లులు పంచుకున్నారట.. ఆ టైంలోనే కొత్త బిల్డింగ్ ని లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ గుండు కి అమ్మేశారట . ఆయన కొన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉండేవారట . అలా అతనే ఆ ఇంటిని తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు ఆయనకు సావిత్రి గారు అంటే మహా మహా ఇష్టమట. సావిత్రి గారు ఆస్తి కొనడం వల్లే ఆయన ఈ రేంజ్ లో ఎదిగాడు అని కలిసొచ్చింది అని అభిమానులు అంటున్నారు . అంతేకాదు ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కిరణ్ గుండు కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు . “ఆ బిల్డింగ్ లో సావిత్రి కి సంబంధించిన ఒక పెద్ద ఫోటో ఉండేదని ..ఇప్పటికీ అది అలానే ఉంచుకున్నాను అని ..నాకు ఆవిడ అంతే చాలా చాలా అభిమానం అని తెలిపారు. ఓ విధంగా లలిత జ్యువెలర్స్ ఓనర్ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి కారణం సావిత్రి గారి ఆస్తి అంటున్నారు అభిమానులు”..!!