“నేను ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన టైం వచ్చేసిందోచ్”.. ఫ్యాన్స్ కి మెగా కోడలు గుడ్ న్యూస్..!

లావణ్య త్రిపాఠి..ఒకప్పుడు హీరోయిన్గా ఇప్పుడు మెగా ఇంటి కోడలుగా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్నటువంటి పేరు . అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందాల రాక్షసి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించింది. ఆమె నటించిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్పలేము.. కానీ లావణ్య త్రిపాఠి చూస్ చేసుకునే కంటెంట్ బాగుంటుంది అంటారు జనాలు .

వల్గారిటీ లేకుండా హోమ్లీ పాత్రను చూస్ చేసుకోవడంలో లావణ్య త్రిపాఠి స్టైలే వేరు . మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని లావణ్య .. ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా ఇటలీలో జరిగింది . హనీమూన్ కూడా బాగానే ఎంజాయ్ చేశారు ఈ కపుల్ .

ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వచ్చే లావణ్య త్రిపాఠి.. తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది . “అమ్మ పింకు రూబీ స్టడ్స్ దీని కోసం ఎన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నానో మీకు తెలియదు .. చిన్ననాటి జ్ఞాపకాలను ప్రతిష్టాత్మమైన లింక్ నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది .. అవన్నీ ఇక నావే అంటూ ఆనందంగా పోస్ట్ పెట్టింది .. లైట్ పింక్ కలర్ చీర కట్టుకొని చాలా అదిరిపోయే లుక్స్ లో అట్రాక్టివ్ స్టిల్స్ ఇచ్చింది”. దీనికి సంబంధించిన ఫోటోలు బాగా ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు..!!