ఉదయ్ కిరణ్ సినిమాతో లైఫ్ చేంజ్.. ఇండియాలో రిచెస్ట్ బ్యూటీగా క్రేజ్.. ఆ హీరోయిన్ ఎవరంటే..?!

దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలు నటించి యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ఆయ‌న‌ ఊహించిన విధంగా సూసైడ్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఉదయ్ కిరణ్ హీరోయిన్గా పరిచయం చేసిన ఓ అమ్మడు ఇండియా రిచెస్ట్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ హీరోగా 2004లో తెర‌కెక్కిన‌ లవ్ టుడే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దివ్య ఖోసలా. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. ఆబ్‌ తుమారే హవాలే వాటా సాధియో సినిమాతో బాలీవుడ్ అవకాశాన్ని అందుకుంది.

Love Today (2004) - IMDb

ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అమితాబచ్చన్, బాబి డియోలో సరసన నటించింది. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందకపోవడంతో సినీ కెరీర్ దెబ్బతింది. అయితే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దివ్య ఖోసలా సినీ రంగంలో స్థిరపడాలనే కోరికతో అప్పటికే ఎన్నో ఆల్బమ్స్‌లో మెరిసింది. 90 నాటి ఎన్నో పాప్ సాంగ్స్ లో మెరిసిన దివ్య ఖోసలా పాల్గొణి ఫటాక్ మ్యూజిక్ వీడియో అయ్యో రామాతో పెద్ద సంచలనానే సృష్టించింది. ఈ అమ్మడి గ్రామర్ తో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత సల్మాన్ ఖాన్ సరసన ప‌లు మ్యూజిక్ ఆల్బమ్లో మెప్పించింది. అయితే బాలీవుడ్ లో వచ్చిన మొదటి సినిమానే డిజాస్టర్ కావడంతో సినీ కెరీర్ ఫ్లాప్ అయినా.. వ్యక్తిగత జీవితానికి మాత్రం కొత్త మార్గం ఏర్ప‌డింది.

Divya Khosla Kumar Age Husband Boyfriend Marriage Education

ఈ సినిమా సెట్లో టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ దివ్య ను చూసి ప్రేమలో పడడం.. ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ జంట 2005లో వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి 2011లో బాబు జన్మించాడు. పెళ్లి తర్వాత సినిమాలు వదిలేసిన దివ్య.. 2016లో సనమ్‌రే సినిమాతో రీఎంట్రి ఇచ్చి తర్వాత దర్శక, నిర్మాతగాను పలు సినిమాలను తెరకెక్కించింది. షారుఖ్ రాయ్‌ సినిమాకి నిర్మాతగా మారింది. ప్రొడ్యూసర్గా 8 సినిమాలను తెర‌కెక్కించి 2021లో సత్యమేవ జయతే 2 సినిమాతో జాన్ అబ్రహం సరసన నటించింది.

Hero Heroine: दिव्या खोसला कुमार की 'हीरो हीरोइन' का फर्स्ट लुक जारी, रियल  लाइफ लव स्टोरी पर बेस्ड है फिल्म - Haribhoomi

చివరిసారిగా యారియన్ 2 సినిమాలో ఆకట్టుకుంది. ఈ సినిమా బెంగళూరు డేస్ మలయాళ మూవీ రీమేక్ గా వ‌చ్చింది. ఇక పలు నివేదికల ప్రకారం దివ్య ఖోసల కుమార్ నికర ఆస్తుల విలువ సుమారు 5 మిలియన్లు అంటే దాదాపు 42 కోట్లు.. హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్ 2022లో అతని కుటుంబ నికర విలువ పదివేల కోట్లతో.. 175వ అత్యంత సంపన్న భారతీయుడిగా ర్యాంకింగ్ పొందారు. ఇక చాలా కాలం తర్వాత దివ్య మరోసారి ప్రధాన పాత్రలో ” హీరో హీరోయిన్ ” టైటిల్ తో తెలుగు, హిందీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ఎంట్రీ తెలుగు సినిమాతో పరిచయం కాబట్టి.. తెలుగులో కూడా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాలని ప్లాన్ లో ఉందట దివ్య.