శ్రీరామ నవమి స్పెషల్: సంచలన ప్రకటన చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. !

ప్రశాంత్ వర్మ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా మారుమ్రోగిపోతున్న పేరు . ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెరకెక్కించింది తక్కువ సినిమాలు .. తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా ఓ మైల్ స్టోన్ గా క్రియేట్ చేసుకున్నాడు . రీసెంట్గా ప్రశాంత్ తెరకెక్కించిన సినిమా హనుమాన్ . తేజ సజ్జ హీరోగా తెర్కెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది .

ఈ సినిమాకి కాంపిటీషన్ గా వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం చిత్తుచిత్తు చేసి పెట్టింది . ఇప్పటికీ హనుమాన్ సినిమాము జనాలు లైక్ చేస్తున్నారు అంటే కారణం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అనే చెప్పాలి . ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది అంటూ అప్పట్లోనే ప్రకటించేసాడు . ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు .

కాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులకు జై హనుమాన్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు ప్రశాంత్ వర్మ . “ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడు దివ్య ఆశీర్వాదంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ఒక ప్రామిస్ చేస్తున్నాను.. మునిపెన్నడూ లేని అనుభూతిని జీవితకాలం జరుపుకునే చాలా చిత్రాన్ని మీకు అందిస్తాను కచ్చితంగా మీకు లైఫ్ లో గుర్తుండిపోతుంది .. ఇది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా కాబోతుంది అంటూ రాసుకోచ్చాడు “. దీంతో కొందరు నెటిజన్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది .. ఈసారి ఈ సినిమా గూస్ బంప్స్ కాదు అంతకుమించిన రేంజ్ లో అభిమానులకి ఫ్రెష్ ఫీలింగ్ కలగజేస్తుంది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మొత్తానికి ప్రశాంత్ వర్మ మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకునేలానే ఉన్నాడు..!!