విడాకుల విషయంలో ఐశ్వర్య – ధనుష్ కు ఊహించిన షాక్ ఇచ్చిన చెన్నై కోర్ట్.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!

సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న స్టార్ సెలబ్రిటీల లిస్ట్ ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. ఏదో అంగడికి వెళ్లి చాక్లెట్లు కొనుక్కున్నంత ఈజీగా కొర్ట్ కు వెళ్లి విడాకులు తీసేసుకుంటున్నారు స్టార్ సెలబ్రిటీస్ . మరి ముఖ్యంగా డబ్బు ఉన్న స్టార్ సెలబ్రిటీసే ఇలా విడాకులు తీసుకుంటూ ఉండడం గమనార్హం . అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ధనుష్ తన భార్య ఐశ్వర్య కు విడాకులు ఇవ్వబోతున్నాను అని ఎప్పుడో ప్రకటించారు .

అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకోబోతుంది అంటూ జనాలు సైతం బాధపడ్డారు. దానికి రీజన్ ఏంటా అంటూ బాగా ఆలోచించారు ..చర్చించుకున్నారు . కానీ ఎక్కడ ఆన్సర్ దొరకలేదు . అయితే ఆ తర్వాత ఈ జంట కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉండిపోయారు. విడాకులకు సంబంధించి ఏ ప్రకటన చేయలేదు. దీంతో వీళ్ళు మళ్ళీ కలవబోతున్నారు అంటూ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు .

అయితే సడన్గా ఏమైందో ఏమో ఐశ్వర్య చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకులు కావాలి అంటూ పిటిషన్ వేసింది . దీంతో ఒక్కసారిగా మళ్ళీ అభిమానులకు బిగ్ షాక్ తగిలినట్టు అయింది . అయితే ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు అక్టోబర్ 7వ తేదీ ఫైనల్ తుది తీర్పు వివరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దీంతో ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎలాగైనా సరే పిల్లల కోసమైనా వీళ్ళు కలుస్తారు అనుకున్నారు అభిమానులు . కానీ ఐశ్వర్య ధనుష్ తో కలవడానికి సిద్ధంగా లేదు అంటూ తెలిసిపోయింది..!