ఓరి దేవుడోయ్..బన్నీ ఫ్యాన్స్ ఇలా ఉన్నారు ఏంట్రా బాబు.. బర్త డే రోజు అర్ధరాత్రి ఏం చేశారో చూడండి..!

నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్డ డే విషెస్ అందజేస్తున్నారు . అంతేకాదు అల్లు అర్జున్ పై తమకున్న ప్రేమను వివిధ రూపంగా చాటుతున్నారు . కొందరు అన్నదానం చేస్తే మరికొందరు రక్తదానం చేయడం .. మరికొందరు ఆయన సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చేయడం రకరకాలుగా బన్నీను ఎంకరేజ్ చేస్తున్నారు.

బర్త్డ డే విషెస్ చెబుతున్నారు . అయితే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఇంటి వద్ద అర్ధరాత్రి హంగామా చేశారు . కటౌట్లతో టపాసులతో బన్నీ బయటకు వచ్చి కనిపించేంత వరకు హంగామా చేశారు . అయితే ఫ్యాన్స్ సంతోషం కోసం అర్ధరాత్రి బన్నీ బయటకు వచ్చి తన అభిమానులకు వెల్కమ్ చెప్పారు . ఈ క్రమంలోనే పుష్ప రాజ్ లుక్ కూడా వైరల్ గా మారింది . నిజానికి ఏ స్టార్ సెలబ్రిటీ అర్ధరాత్రి ఇలా బయటికి రారు . కానీ అల్లు అర్జున్ మాత్రం తన అభిమానుల కోసం ఇంటి నుంచి బయటకు వచ్చి తన ఫ్యాన్స్ పై తనకున్న ప్రేమను చాటుకున్నారు .

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . నేడు అయిన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ సూపర్ సక్సెస్ అయింది. చీర కట్టులో అల్లు అర్జున్ మెరిసిన తీరు అభిమానులకు గూస్బంస్ తెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టడం పక్క అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్..!