ఆ ఒక్క తప్పే రామ్ చరణ్ కెరియర్ చిక్కుల్లో పడేలా చేసిందా? అందుకే ఇప్పటికీ అలా చేస్తున్నాడా..?

మెగా పవర్ స్టార్ గా ట్యాగ్ సంపాదించుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ . రీసెంట్ గానే గేమ్ చేంజర్ సినిమా షూట్ కంప్లీట్ చేసుకొని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే మూవీ ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు . మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుత అనే మూవీ తో తెరంగేట్రం చేశాడు . ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు కానీ మాస్ ఇమేజ్ మాత్రం చరణ్ కి క్రియేట్ చేసి పెట్టింది .

ఆ తర్వాత రిలీజ్ అయిన మగధీర ఆయన పేరు జనాలకు తెలిసేలా చేసింది . ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది . అయితే ఆ తర్వాత మాత్రం చరణ్ కి అంత సక్సెస్ రాలేదు. దానికి కారణం ఆయన కెరియర్ లో తీసుకున్న కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు . తన బాడీకి సూట్ అవ్వని కధలని చూస్ చేసుకోవడం రొటీన్ సినిమాలనే చేస్తూ ఉండడం మెగా ఫాన్స్ కు బోరింగా అనిపించింది .

అదే ఆయనపై విమర్శలు గుప్పించేలా చేసింది . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కొడుకు అంటే ఇండస్ట్రీకి మరో మెగాస్టార్ అని మరి అలాంటి వ్యక్తి ఇలా కామన్ సినిమా కధలు చూస్ చేసుకుంటే ఎలా..? అంటూ ట్రోల్ చేశారు . ఆ తర్వాతనే చరణ్ రంగస్ధలం, ధ్రువ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చూస్ చేసుకోవడం ప్రారంభించారు. గేమ్ ఛేంజర్ లో కూడా చాలా చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు అంటూ లీకైన పిక్స్ ఆధారంగా తెలుస్తుంది.

కామన్ గా ఉండే కథలు ఏ హీరో అయినా చేస్తాడు. ఒక స్టార్ హీరో కొడుకు ఇండస్ట్రీలో స్టార్ గా మారాలి అంటే మాత్రం కచ్చితంగా ఆయనలో సపరేట్ టాలెంట్ ఉండాలి . ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోబట్టే రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు అంటున్నారు జనాలు. అంతేకాదు ఇప్పటికి రామ్ చరణ్ తన సినిమాల విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకుంటారట..!!