ఎన్టీఆర్ మాట్లాడిన ఒక్క మాట..ఒక్కే ఒక్క మాట.. 100 కోట్ల రూపాయలకు బొక్క పడేలా చేసిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఆయనకు 100 కోట్లు బొక్క పడేలా చేసిందా..? అంటే ఎస్ అంటున్నారు అభిమానులు . మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్ గా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో హిట్ కొట్టింది . ఇండియాకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చింది . ఈ సినిమా తర్వాత చరణ్-తారక్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు .

అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకున్నారు . దేవర సినిమా చేయడానికి ..ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నాడో..? అభిమానులకు సైతం అర్థం కాలేదు . అంతేకాదు అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి దేవర ఫస్ట్ భాగం విడుదల అయిపోయి ఉండేది . ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ చేయాలి అనుకున్నారు మేకర్స్ . కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. అసలు దేవర సమ్మర్ కి రిలీజ్ చేసి ఉంటే కాంపిటీషన్ ఏ విధంగా ఉండే సినిమాలు రిలీజ్ అవ్వకపోవడం అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ కలిసి రావడం ఎన్టీఆర్కు బాగా ప్లస్ అయ్యేది .

కచ్చితంగా 100 కోట్లు క్రాస్ చేసేసి ఉండేది . అయితే మేకర్స్ తీసుకున్న డెసిషన్స్ ను యాక్సెప్ట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విషయంలో పోస్ట్ పోన్ చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం బాధగా ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ అవుతుంది . అప్పుడు సినిమా హిట్ అవుతుంది . ఆలోపే కల్కి, పుష్ప2 సినిమాలు క్రేజీ రికార్డులు నెలకొల్పేస్తాయి. ఆ రికార్డుల ముందు దేవర సినిమా అంత పెద్ద టార్గెట్ పెట్టుకొని రికార్డ్స్ క్రియేట్ చేయగలదా..? అంటూ జనాలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు..????