జనసేనానికి అండగా మెగాస్టార్.. పార్టీకి రూ. 5కోట్ల విరాళం అందించిన చిరు.. !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనా అధినేతగా ఏపీ రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి విజయం, ఓటమితో సంబంధం లేకుండా ప్రజలకు తన సహాయం అందిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్‌కు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అండ కూడా దొరికింది. ఇందుకు ఉదాహరణ తాజాగా జరిగిన ఆ సంఘటనే. మెగాస్టార్ చిరంజీవి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కోసం ఏకంగా రూ.5కోట్ల భారీ విరాళాన్ని అందించాడు.

దీనికి సంబంధించిన చెక్కులు పవన్ కళ్యాణ్ కు అందిస్తూ జనసేన సక్సెస్ సాధించాలని ఆయన వివరించాడు. నీకు అండగా ఎప్పుడూ నేను ఉంటా అంటూ చిరంజీవి చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జనసేన ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్‌లో చిరంజీవి విశ్వంభరా సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ లోకేషన్ ఇందుకు వేదికగా మారింది. షూటింగ్ లోకేషన్ కు వెళ్లిన నాగ‌బాబు, పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిసి బుక్కే ఇచ్చి గౌరవించారు.

చిరంజీవి తమ్ముళ్లు ఇద్దరినీ ఆత్మీయంగా హగ్ చేసుకుని వారికి చెక్క అందించారు. చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్ కళ్యాణ్ కాసేపటికి ఆయనతో ముచ్చటించారు. నాగబాబు కూడా ఇందులో భాగమయ్యారు. ముగ్గురు కాసేపు ముచ్చటించుకున్న తర్వాత ఈ చెక్‌ పవన్ కళ్యాణ్ కు చిరంజీవి అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ నెటింట వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by JanaSena Party (@janasenaparty)