దేవర పై గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన తారక్.. పండగ చేసుకొండ్రా ఫ్యాన్స్..!

కోట్లాదిమంది నందమూరి అభిమానులు దేవర సినిమా కోసం ఏ రేంజ్ లో కళ్ళల్లో వత్తులు వేసుకుని వెయిట్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ అవ్వాల్సిన దేవర సినిమా పోస్ట్ పోన్ అయ్యి దసరాకు రిలీజ్ అవుతూ ఉండడం ఫాన్స్ కి బాధ గా అనిపిస్తుంది . అయితే ఇదే క్రమంలో రీసెంట్గా ఓ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు పిచ్చెక్కించే రేంజ్ లో దేవర సినిమాకి సంబంధించిన ఒక కీలక న్యూస్ ని లీక్ చేశారు.

సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు జూనియర్ ఎన్టీఆర్ . స్టేజి పైకి రాగానే తనదైన స్టైల్ లో స్పీచ్ ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు. సిద్దు జొన్నలగడ్డను ఓ రేంజ్ లో పొగిడేసారు. అంతేకాదు నవ్వించడం అనేది ఒక ఆర్ట్ అని అందరివల్ల కాదు అంటూ పొగిడేసారు .

ఇదే క్రమంలో కొన్ని డైలాగ్స్ చెప్పిన నందమూరి అభిమానులను ఖుషి చేశారు. ” కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి.. అంతేకానీ నేనున్నాను అని గుర్తించండి “అంటూ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది స్టైల్ లో డైలాగ్ చెప్పి ..ఐ యామ్ టెల్లింగ్ దట్ అంటూ నవ్వులు పోయించాడు జూనియర్ ఎన్టీఆర్ . అంతేకాదు కంటిన్యూవేషన్ గా పోలే అద్దిరి పోలే అంటూ త్రివిక్రమ్ కూడా నవ్వించేసాడు . ఇది దేవర సినిమాలో ఒక డైలాగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఇదే న్యూస్ ప్రెసెంట్ నెట్టింట వైరల్ గా మారింది..!