విడాకులు తీసుకున్న తరువాత ఫస్ట్ టైం “అక్కినేని” పేరు ప్రస్తావించిన సమంత..ఎందుకంటే..?

మనకు తెలిసిందే హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన సమంత అక్కినేని హీరో నాగచైతన్య ని పెళ్లి చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అయితే వీళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఇప్పటికీ వీళ్ళు అస్సలు మాట్లాడుకోవడం లేదు.

విడాకులు తీసుకునే టైం లో మాత్రం మంచి ఫ్రెండ్స్ గా ఉంటాము అంటూ చెప్పుకొచ్చారు . కానీ ఆ తర్వాత అస్సలు మాట్లాడుకోవడం లేదు. అయితే సమంత విడాకులు తీసుకున్న అక్కినేని అఖిల్ తో బాగా మాట్లాడుతుంది . ఆయన సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అలాగే ఆయనకు బర్త్డ డే విషెస్ కూడా అందజేస్తుంది . రీసెంట్ గా అఖిల్ అక్కినేని తన పుట్టినరోజును జరుపుకున్నాడు .

ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్న కూడా అక్కినేని అఖిల్ పేరును ట్యాగ్ చేసి సమంత మాజీ మరిదికి బర్త్ డే విషెస్ అందించింది . సోషల్ మీడియాలో ఈ స్క్రీన్ షాట్ బాగా వైరల్ గా మారింది. సమంతకి మొదటి నుంచి అఖిల్ అంటే చాలా చాలా గౌరవం అని .. ఆ కారణంగానే ఆయనకు బర్త్డ డే విషెస్ అందజేసింది అంటున్నారు సమంత ఫ్యాన్స్.
ప్రజెంట్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది ..పలు అవకాశాలు వస్తున్న సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ కెరియర్లో ముందుకెళ్లడానికి చాలా కష్టపడుతుంది..!!