అలాంటి రోల్ లో నటించమంటూ..ప్రభాస్ ని బలవంతం చేసిన డైరెక్టర్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లాదిమంది అభిమానులు ఆయన నటించే సినిమాల కోసం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ వెయిట్ చేస్తూ ఉంటారు . కాగా ప్రెసెంట్ ఆయన నటించిన కల్కి సినిమా సెట్స్ పై ఉంది. మే 30వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత రాజా సాబ్ సినిమాని కూడా కంప్లీట్ చేసేసి స్పిరిట్ , సలార్ 2 ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ప్రభాస్ .

ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది . ప్రభాస్ వర్షం మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు . ఈరోజు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు . అయితే ఒకానొక మూవీలో ప్రభాస్ ను గే లాగా నటించమంటూ డైరెక్టర్ బలవంతం చేశారట . ఆ సినిమా మరేదో కాదు చక్రం .

కృష్ణవంశీ దర్శకత్వంలో ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది . కానీ ప్రభాస్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాలోని ఓ సీన్లో ప్రభాస్ గే లాగా కూడా యాక్ట్ చేశాడు . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయట పెట్టాడు ప్రభాస్. దీనికి సంబంధించిన న్యూస్ను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . “చక్రం చిత్రంలో ఇష్టం లేకపోయినా సరే అలా నటించాల్సి వచ్చింది.. కానీ డైరెక్టర్ చెప్పడం కారణంగానే నేను చేశాను.. సినిమా అన్నాక అన్నిటికి కట్టుబడి ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు”. ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి…!