గంగమ్మ జాతరలో పుష్పరాజ్ బలిచ్చేది వాడి నేనా ? టీజర్ లో హింట్ ఇచ్చిన సుకుమార్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప సినిమాకు సంబంధించిన టాక్ ఎక్కువగా వినిపిస్తుంది . బన్నీ బర్త డే సందర్భంగా పుష్ప సినిమా నుంచి క్రేజీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడ్డాయి అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ టీజర్ లో అల్లు అర్జున్ ప్రధానంగా హైలెట్ చేసి చూపించారు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ అమ్మవారికి గెటప్ లో చీర కట్టుకుని కనిపించడం సినిమాకి హైలైట్ గా మారింది .

ఈ సినిమా మొత్తానికి గంగమ్మ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది అంటూ టీజర్ ఆధారంగా తెలుస్తుంది. ఇదే క్రమంలో అల్లు అర్జున్ గంగమ్మకు బలిచ్చేది ఎవరిని అనే విషయం బాగా వైరల్ గా మారింది . టీజర్ ఆధారంగా చూసుకుంటే జాతరలో కొందరు పురుషులు కూడా ఆడవారి వేషం కట్టడం మనం చూసాం. పుష్ప2లో పాలకుడికి దగ్గరగా పోలికలు ఉండే పాత్ర జాలి రెడ్డి .

జాలి రెడ్డికి మొదటి నుంచి అమ్మాయిల పిచ్చి ఎక్కువ. అదే విషయాన్ని బాగా హైలెట్ చేసి చూపిస్తాడు మొదటి భాగంలో సుకుమార్ . ఒకవేళ అదే నిజమైతే మొదటి భాగంలో జరిగిన గొడవల కారణంగా అవకాశం దొరికితే పుష్ప రాజ్ కచ్చితంగా జాలిరెడ్డిని చంపడానికి ట్రై చేస్తాడు. ఆ విధంగా అల్లు అర్జున్ అమ్మవారి వేషంలో సంహరించేది జాలిరెడ్డినే అంటూ అనుమానాలు కలుగుతున్నాయి . టీజర్ లో కూడా అదే విషయాన్ని పరోక్షకంగా కన్ఫామ్ చేసేసాడు సుకుమార్ అంటూ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!