‘ మంజుమ్మల్ బాయ్స్ ‘ షోలు ఆపేసారు.. ఫైర్ అవుతున్న మైత్రి మూవీస్.. అసలు గొడవ ఇదే..?!

ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మంజుమ్మ‌ల్ బాయ్స్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ కొద్దిరోజుల క్రితం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. అయితే ఈ గురువారం అనుకోకుండా పీవీఆర్ మల్టీప్లెక్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షోలను ఆపివేసింది. దీంతో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శ‌శిధ‌ర్‌రెడ్డి నిర్మాతల మండలిని అప్రోచ్ అయ్యారు. సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో షోలను ఆపివేయడం పై ఫైర్ అయ్యారు. మలయాళ నిర్మాత తో ఇబ్బంది ఉంటే తెలుగు వర్షన్ ఎలా ఆపుతారు అంటూ ప్రశ్నించారు. దీంతో పివిఆర్ మల్టీప్లెక్స్ వ్యవహారాలపై నిర్మాతల మండలి అత్యవసర సమావేశాన్ని ప్రారంభించింది. ఇంతకీ అసలు గొడవ ఏంటంటే.. గత కొంతకాలంగా పివిఆర్ మల్టీప్లెక్స్‌కి.. మలయాళ సినీ ఇండస్ట్రీకి మధ్య వివాదాలు మొదలయ్యాయి. దీనికి కారణం డిజిటల్ ప్రొవైడర్లు.

MANJUMMEL BOYS - Cineco Bahrain

డిజిటల్ ప్రొవైడర్లలో ముఖ్యంగా యు ఎఫ్ ఓ క్యూబ్ ను టాలీవుడ్ వినియోగిస్తూ ఉంటారు నిర్మాతలు. తమ సినిమాలను ఈ డిజిటల్ ప్రొవైడర్ ఫార్మేట్‌లోకి మార్చి ఇస్తారు. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. భారీ స్థాయిలో కోట్లు ఖర్చు చేసి సినిమాలను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్లు గత కొంతకాలంగా క్యూబ్ కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో భారీగా వారు నష్టపోతున్నారట. గతంలో ప్రింట్ సిస్టం మాత్రమే ఉండడం డిజిటలైజేషన్‌లో భాగంగా డిజిటల్ ప్రింట్ భారీ స్థాయిలో వాడకంలోకి రావడంతో చాలావరకు థియేటర్లన్నీ డిజిటలైజ్ చేసేసారు. అయితే నిర్మాతలకు ఇది పెను భారంగా మారుతూ వస్తోందని.. డిజిటల్ ప్రొవైడర్లు ఈ విషయంలో తమను దోపిడీ చేస్తున్నారంటూ నిర్మాతలు ఆరోపిస్తున్నారు.

PVR cinemas - All You Need to Know BEFORE You Go (2024) - Tripadvisor

గత కొంతకాలంగా దీనిపై చర్చ జరుగుతున్న సమస్య కొలికి రాక‌పోవ‌డంతో ఈ వివాదం పై కేరళ నిర్మాతలు తాజాగా ఓ నిర్ణయానికి వచ్చారట. మలయాళ నిర్మాతలు తమ సొంత ప్రొడక్షన్ కంటెంట్ మాస్టరింగ్ సిస్టం (పిడిసి) ని ఏర్పాటు చేసుకొని.. పివిఆర్ వారిని అవే వాడమని కోరారట. తమ సినిమాలను ఆ ఫార్మాట్లో ప్రదర్శించమని చెప్పడంతో ఓ కొత్త ఫార్మేట్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి పివిఆర్‌కు చాలా ఖర్చవుతుంది. ఈ క్రమంలో మలయాళ సినీ ఇండస్ట్రీ, పివిఆర్‌ల‌ మధ్య గొడవ మొదలైంది. దీంతో మలయాళ సినిమాల ప్రదర్శనలను ఆపేశారు. అందులో భాగంగానే మంజుమ్మ‌ల్ బాయ్స్ తెలుగు వర్షన్ కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది. దీంతో పీవీపీ తీరుపై మైత్రి మూవీ మేకర్స్ ఫైర్ అవుతున్నారు.

Best Movie Makers in the Entertainment Industry

న్యాయం కోసం నిర్మాతల మండలని ఆశ్రయించగా మలయాళ నిర్మాతతో వివాదం అయితే తెలుగు వెర్షన్ నిలిపివేయడం ఏంటి అంటూ ప్రశ్న ఎదురయింది. ఏదైనా గొడవ ఉంటే మీరు నేరుగా వారితో మాట్లాడుకోవాలని.. వెంటనే షోలను ప్రదర్శించమని పివిఆర్ యాజమాన్యానికి వివరించింది. అయినా పివిఆర్ యాజమాన్యం వినిపించుకోలేదట. దీంతో ఈ విషయమై తెలుగు ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించారు డిస్ట్రిబ్యూటర్స్. పివిఆర్ మల్టీప్లెక్స్ వ్యవహారంపై ఆయన ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయగా.. స్పందించిన ఫిలిం ఛాంబ‌ర్‌ వారు వెంటనే పివిఆర్ యాజమాన్యంతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌వ‌సుళ‌ను సాధించిన మొట్టమొదటి మలయాళ సినిమాగా ఈ మంజుమ్మ‌ల్ బాయ్స్ నిలిచింది. ఇక ఈ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 22న సర్వైవల్ థ్రిల్లర్‌గా తర్కెక్కింది. అక్కడ సక్సెస్ కావడంతో ఏప్రిల్ 6న తెలుగులో ఈ సినిమాను డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.