కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న అనిల్ రావిపూడి.. అతని స్టైలే వేరు..!!

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి దర్శకుడు అయినా సరే.. తాను తీసే సినిమాలతో ఓ జాన‌ర్‌ డైరెక్టర్ గా ఫిక్స్ అవుతూ ఉంటారు. అలాగే అనిల్ రావిపూడి పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్స్. తనదైన స్థాయిలో కామెడీని జోడించి కమర్షియల్ సినిమాలను తీస్తూ అద్భుతమైన సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆయన తీసిన మొదటి సినిమా పటాస్ నుంచి ఎఫ్2, రాజా ది గ్రేట్ వరకు ప్రతి సినిమా కమర్షియల్ యాంగిల్ లో కామెడీ జోడించి ఏమాత్రం మిస్ అవ్వకుండా హిట్ అందుకున్నాడు. అలాగే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టిన‌ తాను సినిమాలో కామెడీని మిస్ చేయలేదు. మహేష్ లాంటి క్యూట్ అండ్ స్మార్ట్ హీరో దగ్గర నుంచి కూడా అనిల్ కామెడీ చూపించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

From Assistant Director To a Filmmaker, The Inspiring Journey of Anil  Ravipudi - News18

ఆయన సినిమాల్లో నటించే ఎలాంటి నటినటుల నుంచి అయినా.. కచ్చితంగా కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునే డైలాగులు వచ్చేలా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాడు ఈ యంగ్‌ డైరెక్టర్. అందుకే అనిల్‌ను కామెడీ స్టార్ట్ డైరెక్టర్ అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ ముద్ర నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తున్నాడు అనిల్. ఇప్పటివరకు చూసిన‌ సినిమాలు లెక్క వేరు, తర్వాత చూడబోయే స్టోరీల లెక్క వేరు.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్న అంటూ వివరిస్తున్నారు. భగవంత్‌ కేసరి సినిమాతో తనలోని దర్శకుడికి పని చెప్పి వైవిధ్య‌మైన‌ కథతో సక్సెస్ అందుకున్నాడు.

Music Sittings Started For Venkatesh And Anil's Film

అప్పటివరకు తీసిన సినిమాలకు ఈ సినిమాకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ సినిమాలో కామెడీనే కాకుండా యాక్షన్ సినిమాలను కూడా సక్సెస్‌ఫుల్‌గా తీయగలనని నిరూపించాడు. ఇక తాజాగా అనిల్ ప్రకటించిన తన నెక్స్ట్ మూవీలో కూడా మునుపటి సినిమాలకు చాలా డిఫరెంట్‌గా కథను ఎంచుకున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు వెంకటేష్‌తో ఎఫ్2, ఎఫ్3 లాంటి ఫన్ సినిమాలు రెండింటిని తెరకెక్కించిన వీరిద్దరూ.. కాంబినేషన్ కంటిన్యూ చేస్తూ కామెడీతో పాటు సీరియస్‌ టచ్ ఇచ్చేలా కొత్త కథతో రానున్నార‌ట‌. వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించనున్నాడు. కెప్టెన్ అనే పేరు కూడా ఫిక్స్ అయ్యాడట అనిల్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన చేసిన ప్రయోగాలేంటో తెరపై చూడవచ్చు అని చెబుతున్నాడు.