రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. సెలబ్రేషన్స్ లో ఫ్యాన్స్..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న చరణ్.. ఈ సినిమాతో ఎన్నో అవార్డ్‌లను దక్కించుకున్నాడు. ఈ క్ర‌మంలో చరణ్‌కు మ‌రో అరుదైన గౌరవం అందినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. పురస్కారాలు అనేవి ప్రతిభకు కొలమానాలుగా కొలుస్తూ ఉంటారు. అర్హత ఉన్న వారిని వరించినప్పుడు పురస్కారాలు కూడా దానిని గౌరవంగా ఫీల్ అవుతాయి. తాజాగా అలా రామ్ చరణ్‌కు అర్హత ఉన్న ఓ అవార్డ్‌ చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ అందించబోతున్నట్లు వివరించింది.\

Ram Charan to appear on Good Morning America show, to premiere on February  23 - India Today

ప్రస్తుతం రామ్ చరణ్‌కు డాక్టరేట్‌ అందిందని తెలియడంతో మెగా అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ ఈ డాక్టరేట్‌కు అసలైన అర్హుడు. తక్కువ సినిమాలతో ఖండాంతర ఖ్యాతిని సంపాదించుకున్న చరణ్.. పాన్ వర‌ల్డ్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. త్వరలో గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న చెర్రీ.. న‌టించిన‌ అతి తక్కువ సినిమాలతోనే మూడు ఇండస్ట్రీ హీట్లను అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాతో మొదటి ఇండస్ట్రీ హిట్ను అందుకున్నాడు. ఈ సినిమాలో జానపద వీరుడుగా ఆకట్టుకున్నాడు.

100+] Ram Charan Hd Wallpapers | Wallpapers.com

అలాగే వీరిద్దరి కాంబోలో వ‌చ్చిన మరో సినిమా ఆర్ఆర్ఆర్ లోను మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెప్పించాడు. తుఫాన్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో బాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో వ‌చ్చిన రంగస్థలంలో చిట్టి బాబుగా ఆయన నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం నటుడుగానే కాకుండా సామాజిక సేవల్లో కూడా చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నాడు. దీంతో చరణ్ కి డాక్ట‌రేట్‌ సరిగ్గా సరిపోతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈనెల 13న జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రామ్ చరణ్ కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు.