షుగర్ పేషెంట్‌లు పుచ్చకాయ తినడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా.. తప్పక ఆశ్చర్యపోతారు..?!

సమ్మర్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫ్రూట్స్‌ పుచ్చకాయ, మామిడికాయ. వీటికి ప్రజల్లో ఎంతో డిమాండ్ ఉంటుంది. పుచ్చకాయ తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని.. పొట్టలో చల్లగా అనిపిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ పుచ్చకాయని షుగర్ పేషెంట్స్ తినవచ్చా.. లేదా.. అనే సందేహాలు ఎంతో మందిలో ఉంటాయి. ఇది మరీ అంత తీయగా ఉండదు కనుక తినవచ్చు అని కొంతమంది పుచ్చకాయ తీసుకుంటూ ఉంటారు. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. పుచ్చకాయలు నీరు, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుందట. అయినా ఇది కొంచెం ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగే ఉంటుందని.

కనుక డయాబెటిక్ పేషెంట్ కేవలం రోజుకు ఒక కప్పు పుచ్చకాయని మాత్రమే తినవచ్చని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పుచ్చకాయను షుగర్ వ్యాధిగ్రస్తులు అల్పాహారంగా మాత్రమే తీసుకోవాలట. భోజనం లాగా అసలు తినకూడదని.. రాత్రిపూట పుచ్చకాయను సేవించకూడదని.. భోజనానికి ముందు, భోజ‌నం తర్వాత పుచ్చకాయ వెంటనే తీసుకోకూడదని.. ఉదయం లేదా సాయంత్రం వేళలో పుచ్చకాయను అల్పాహారంగా తీసుకోవడం మంచిదేనని.. నిపుణులు చెప్తున్నారు. దీనిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన డిహైడ్రేషన్.. చల్లదనం లభించడమే కాదు.. విటమిన్ సి, ఏ, బి6 లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫాలెట్‌, క్యాల్షియం లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో పుచ్చకాయ తినడం వల్ల బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుందట. అలాగే జుట్టు కూడా దృఢంగా మారుతుందని చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తుందని నిపుణులు చెప్తున్నారు. మూత్రణాల ఇన్ఫెక్షన్ ను నయం చేయడానికి పుచ్చకాయ కీలక పాత్ర వహిస్తుంది. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తుల విషయానికి వస్తే బ్లూబెర్రీ, స్ట్రాబెరీస్, చెర్రీ, కీవీ, జామ, నారింజ, బొప్పాయి లాంటి పండ్లను తక్కువ మోతాదులో షుగర్ వ్యాధిగ్రస్తులు తినడం మంచిదట‌.