ప్రెగ్నెన్సీ టైంలో గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?!

సాధారణంగా గుమ్మడి గింజలను పోషకాల గనిగా చెబుతుంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల ఏం జరుగుతుందో.. ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటో.. ఒకసారి తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో కొన్ని ఆహారాల‌న్ని తీసుకోకూడదు అని చాలామందిలో అనుమానాలు ఉంటాయి. ఇలా గర్భధారణ టైంలో గుమ్మడి గింజలు తినవ‌చ్చా లేదా అనే సందేహాలు కూడా చాలామందిలో ఉంటాయి. అయితే ప్రెగ్నెన్సీ టైంలో గుమ్మడి గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇది స్టోర్స్‌లో చాలా విరివిగా దొరుకుతుంటాయి.

ప్రతిరోజు ఒక్క స్పూన్ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి తగ్గ మోతాదులో లభిస్తాయి. ఆరోగ్యమైన కొవ్వులు, ప్రోటీన్స్ ఈ గుమ్మడి గింజల్లో సమృద్ధిగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పోషకాలు శరీరానికి చాలా అవసరం. గుమ్మడి గింజల్లో ఉండే జింక్.. పిండా అభివృద్ధికి సహకరిస్తుంది. జింక్‌కణాల పెరుగుదల మరియు విభజనలో పాల్గొంటుంది. నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గుమ్మడి గింజల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. శరీరకణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ చాలా అవసరం.

పెరుగుతున్న పిండం సరిగ్గా అభివృద్ధి చెందాలంటే దానికి ఆక్సిజన్ అవసరమవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో రక్తహీనత సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు గుమ్మడి గింజలను రోజు సేవించడంతో చెక్ పెట్టవచ్చు. అలానే మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహకరిస్తుంది. డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా గర్భధారణ సమయంలో ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ గుమ్మడి గింజల్లో ఉండే ఫైబర్, మెగ్నీషియం.. షుగర్ లెవెల్స్ ను మెరుగుపరచడానికి ప్రేగు కదలికలను సాఫీ చేయడానికి.. మలబద్ధక సమస్యలను చెక్ పెట్టడానికి తోడ్పడతాయి.