రంజాన్ వేడుకలో క్వీన్ లా మెరిసిన ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ఈమె ఓ ముస్లిం అని చాలామందికి తెలియదు..?!

ఈ పై ఫోటోలో ముంతాజ్ లుక్‌లో కనిపిస్తున్న ముద్దుగుమ్మ సౌత్ స్టార్ హీరోయిన్. మొదటి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తమిళ్ మ‌ళ‌యాళం ఇండస్ట్రీలోను వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోయింది. భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. బాలీవుడ్ వైపుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈమె.. హిందీలో రావణ్‌, చెన్నై ఎక్స్ప్రెస్, ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే చివరిగా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కింగ్ కాంగ్ షారుక్‌ జవాన్ మూవీ లోను ఓ కీలక పాత్రలో నటించింది.

తెలుగు ఓటీటీ మూవీ భామ కలాపం 2, మలయాళం లో నేను, హిందీలో ఆర్టికల్ 370.. ఇలా అన్ని భాషల్లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్‌డంను సంపాదించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా అజయ్ దేవగణ్ సర‌స‌న మైదాన్‌ సినిమాల్లో నటించింది. ఏప్రిల్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు ముందే భారీ హైప్‌ సంపాదించుకున్న ఈ సినిమాలో ఈమె ఓ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించనుంది. అయితే ప్రస్తుతం స్పెషల్ ఎటైర్‌తో మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్ప‌టికే ఈ భామ ఎవరో గుర్తుపట్టి ఉంటారు. ఎస్ మీరు అనుకున్నదే కరెక్ట్. ఆమె ప్రియ‌మణి. రంజాన్ వేడుకలను పురస్కరించుకుంటూ అచ్చమైన ముస్లిం మహిళల మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

గ్రీన్ గాగ్రా చోళీ ధరించి.. ముంతాజ్‌ జ్యువెలరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలను షేర్ చేసిన ప్రియ‌మ‌ణి అభిమానులకు ఈద్ ముబారక్ తెలియజేసింది. ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే నెట్టింటి వైరల్ గా మారడంతో.. అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారంటూ, హ్యాపీ రంజాన్ అంటూ తమ శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం జైశ్రీరామ్ అంటూ.. నవరాత్రికి మీరు ఇలాంటి పోస్ట్ చేయలేద ఎందుకని అంటూ తిక్క ప్రశ్నలు అడుగుతూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే నిజానికి ప్రియమణి అయ్యంగర్‌ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ. ఓ రకంగా చెప్పాలంటే ఈమె కేరళలోని బ్రాహ్మణ వర్గానికి చెందుతుంది. కేరళలో అయ్యర్ తల్లిదండ్రులకు బెంగళూరులో ఈ బ్యూటీ జన్మించింది. 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. అతడు ముస్లిం మతస్థుడు కావడంతో.. భర్తకు తగ్గ భార్యగా అతని అడుగుజాడల్లోనే నడుస్తూ మతాన్ని స్వీకరించింది. మతాన్ని గౌరవిస్తూ రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంది. తమ పండుగలను తన భర్త పండుగలను చేసుకుంటూ.. రెండు మతాలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది.