హీరో శివాజీతి రొమాన్స్ పై స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. ఓ వస్తువులా అనుకున్నా ఫీలింగ్స్ రాలేదంటూ.. ?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అర్చన శాస్త్రికి ఇండస్ట్రీలో ప్రత్యేక పరిచయం అవ‌స‌రం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్‌ సంపాదించుకునే ఈ ముద్దుగుమ్మ.. ఖ‌లేజా, నువ్వ‌స్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, కమలాతో నా ప్రయాణం, నేను, పంచమి, తపన, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎక‌ప్పుడు తెలుగులో వ‌రుస సినిమాల‌లో బిజీగా గ‌డిపిన ఈ అమ్మ‌డు.. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా పాల్గొని సందడి చేసింది. ఈమె హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

ఇక మంచి ఫామ్ లో ఉన్న టైంలో పెళ్లి చేసుకున్న అర్చన.. తర్వాత అడుపా ద‌డపా సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందడి చేసిన అర్చన మాట్లాడుతూ కమలాతో నా ప్రయాణం సినిమాలో శివాజీ తో చేసిన బోల్డ్ సీన్స్ పై సంచలన కామెంట్స్ చేసింది. మూవీలో రొమాంటిక్ సీన్స్ నటనగా భావించి చేస్తారా.. లేదా దాన్ని ఫీల్ అవుతారా.. అని యాంకర్ నుంచి ప్రశ్న ఎదురయింది. దీనికి అర్చన స్పందిస్తూ.. ఫీల్ అయ్యేంత సినిమాలేదు. సెట్స్ లో చుట్టూ జనం ఉంటారు. ఫీల్ అవుతూ చేయకపోయినా.. ఫీల్ అవుతున్నట్లుగా కనిపించేలా నటిస్తా. రొమాంటిక్ సీన్స్ బాగా రాకపోతే ప్రేక్షకులు సినిమా చూసి నవ్వుతారు అంటూ చెప్పుకొచ్చింది.

కాబట్టి నేను హీరోలతో రొమాన్స్ సీన్స్ చేసేటప్పుడు.. ఓ వస్తువు అనుకోని రొమాన్స్ చేస్తానే తప్ప.. ఫీల్ అయ్యి చేయను. ఇతర‌ నటినటులు ఎలా చేస్తారో నాకు తెలియదు. నా వరకు అయితే అది ఓ సీన్‌ మాత్రమే. శివాజీ పెళ్ళైన వ్యక్తి. ఆయనతో రొమాన్స్ చేస్తే ఫీలింగ్ ఎలా వస్తుంది.. అయినా నా కో స్టార్ మాత్రమే అంటూ వివరించింది. నాకు ఎవరైనా నచ్చి వారితో రొమాన్స్ చేస్తే అది వేరే విషయం.. నేను కమలాతో నా ప్రయాణం సినిమాలో చాలా బోల్డ్ సన్నివేశాలు నటించా కాని ఒకసారి కూడా రొమాంటిక్ ఫీల్ నాకు రాలేదు. సీన్స్ బాగా రావాలని మాత్రమే శివాజీ గారితో ముందు ప్రాక్టీస్ చేసేదాన్ని. దీంతో ఈ మూవీలో సీన్స్ అన్నీ సింగిల్ టేక్ లో చేయగలిగాం అంటూ చెప్పుకొచ్చింది.