ఆకీరా నందన్ సినీ ఎంట్రీ ఫిక్స్.. ఆ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేయనున్న పవర్ స్టార్ వారసుడు.. ?!

టాలీవుడ్ లో ఒకప్పుడు పాపులర్ సెలబ్రెటీ జంటగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరికీ ఆకీరానందన్, ఆధ్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పవన్, రేణు దేశాయ్ మధ్య విభేదాలతో వీరిద్దరు విడాకులు తీసుకుని కొన్ని సంవత్సరాలుగా వేరువేరుగా ఉంటున్నారు. పవన్ మూడో పెళ్లి చేసుకొని రాజకీయాలు, సినిమాల్లో బిజీబిజీగా గ‌డుపుతుంటే.. రేణు దేశాయ్ మాత్రం తన పిల్లలను చూసుకుంటూ వారికి నచ్చింది చేసేలా ఎంకరేజ్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే పాన్ కొడుకు ఆఖీరా సోషల్ మీడియాలో భారీ పాపులాటి సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వకుండానే తండ్రి రేంజ్ లో క్రేజ్‌ సంపాదించుకున్న ఆఖీరా.. ఎప్పుడెప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తాడా అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది.

కానీ రేణు దేశాయ్ మాత్రం కొడుకుకి మ్యూజిక్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. దీంతో హీరో అవుతాడు అనుకున్న తమ అన్న కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ అవడం ఏంటి అంటూ అంతా ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కొడుకు ఆకీర సినీ ఎంట్రీ ఫిక్సయిందని తెలుస్తుంది. గ్లోబల్ స్టార్ సినిమాతోనే ఆకీరా సినీ ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఆర్‌సీ16 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అలాగే సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయింది.

కాగా ఈ మూవీలో ఆకీరా నందన్ ఓ కీ రోల్‌లో కనిపించనున్నాడని.. అన్న రామ్ చరణ్ స్వయంగా అడగడంతో కాదనలేక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ తెలుస్తుంది. ఇందులో 15 నిమిషాల పాటు ఆకీరా నటించబోతున్నాడట‌. దీంతో ఈ విషయం తెలిసిన అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా గ్లోబల్ స్టార్ సినిమాతో సినీ ఎంట్రీ ఇవ్వడం ఆకీరా కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందని.. నటించే 15 నిమిషాల సీన్స్ తోనే ఇండస్ట్రీని అన్న కొడుడ‌కూ షేక్ అవడం ఖాయం అంటూ పవన్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.