చరణ్ – బుచ్చిబాబు కాంబోలో సెకండ్ హీరోయిన్ గా ఆ క్రేజీ బ్యూటీ.. అసలు గెస్ చేయలేరు..?!

తెలుగు ఇండస్ట్రీలు అడుగుపెట్టే ప్రతి ఒక్క నటీనటులు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించాలంటే దానికి తగ్గట్టుగా శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే రాంచరణ్ కూడా స్టార్ హీరోగా పాపులారిటి సంపాదించుకునేందుకు వరుస సినిమాల్లో నటిస్తూ అహ‌ర్నిశ‌లు శ్రమించారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్న చరణ్.. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు రావడంతో.. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో తన నెక్స్ట్ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌తో ఇటీవ‌ల ప్రారంభించాడు.

Ram Charan RC16 Movie with Buchi Babu and Janhvi Kapoor Begins Shooting With Puja Ceremony | Telugu News - Times Now

ఇక బుచ్చిబాబు, చెర్రీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు బుచ్చిబాబు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మరో హీరోయిన్ కూడా అవసరం ఉండడంతో.. ఆ పాత్ర కోసం యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలను తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నాడట బుచ్చిబాబు. ఇప్పటికే ఆమెకు కథను కూడా వినిపించినట్లు సమాచారం. ఆమె కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన గుంటూరు కారంలో శ్రీ లీల మెయిన్ లీడ్ లో నటించిన సంగతి తెలిసిందే.

Why is Sreeleela planning a break from shoots? - Telugu News - IndiaGlitz.com

ఈ సినిమా ప్రేక్షకులను అలరించకపోవడంతో సినిమా ఫ్లాప్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు చ‌ర‌ణ్‌ సినిమా ఆమె కెరీర్ పరంగా చాలా అవసరం. ఈ సినిమా హిట్ అయితే శ్రీ లీల కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. కనుక వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ఉద్దేశంతో ఈ సినిమా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కి తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుని ఎలాగైనా మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందాలని భావిస్తుందట శ్రీ‌లీల‌. మొత్తానికి ఈ సినిమాతో రామ్ చరణ్, బుచ్చిబాబు ఇద్దరు పాన్ ఇండియాలో మరోసారి తమ సత్తా చాట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.