ఇట్స్ ఫ్యాషన్ బేబీ అంటూ అలాంటి ఫొటోస్ షేర్ చేసిన సమంత.. తమన్నా, రుహణి షాకింగ్ రియాక్షన్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా తోనే సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి స్టార్ బ్యూటీగా మారిపోయింది. అయితే చివరిగా ఖుషి సినిమాలో నటించిన సమంత.. తర్వాత మరే సినిమాలోని నటించలేదు. అయితే గత ఏడాదిగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాడుతూ సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ కారణంగా సమంత పూర్తిస్థాయిగా సినిమాలకు.. ఇప్పటికీ సమయం కేటాయించలేకపోతుందట. దీంతో సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

కాగా ఇటీవ‌ల కాలంలో ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శిస్తూ.. యోగా, పూజలు లాంటివి చేస్తూ తన ఆరోగ్యం కుదుటపడడం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మెడికల్, యోగ, ఫిట్నెస్ ట్రైనింగ్ ఇలా అన్ని రకాలుగా తిరిగి ఆరోగ్యంతో పుంజుకునేందుకు ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం సిటాడెల్‌ వెబ్ సిరీస్ లో నటించాల్సి ఉండగా.. తెలుగులో ఎటువంటి సినిమాలకు క‌మిట్ అవ్వ‌లేదు. ఆమెను వెండితెర‌పై ఆమెను చూడాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సమంత ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా ఆమె ఫ్యాషన్ ఐకాన్ గా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్ లో 34 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏ రేంజ్‌లో క్రేజ్ సంపాధించుకుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. స్యామ్ చేసే ఫోటోషూట్స్ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా స్టన్నింగ్ లుక్‌లో సమంత బ్లాక్ లేజర్ ధరించి ఫోజులు ఇచ్చింది. బ్రా లేకుండా కేవలం బ్లాజర్ తో డిఫరెంట్‌ స్టిల్స్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ ఫొటోస్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఇట్స్ స్టైల్ బేబీ అనే ట్యాగ్‌ను యాడ్ చేసింది. ఇది క్షణంలో వైరల్ అవ్వడంతో అభిమానులు కాదు.. స్టార్ హీరోయిన్స్ తమన్నా, రోహిణి శర్మ లాంటి వారు కూడా దీనిపై స్పందించారు. తమన్న, రోహిణి శర్మ ఇద్దరూ ఫైర్ ఇమోజీలతో సమంత ఫొటోస్ పై తమ రియాక్షన్ తెలియజేశారు.