పుష్ప 2 లో పవన్ కళ్యాణ్… ఏ క్యారెక్టర్ అంటే..!

అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.అల్లు అర్జున్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ యొక్క మొదటి భాగం 2021లో వచ్చి బాక్సాఫీసులను ఊచ కోత కోసింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీకి సీక్వెల్ ని రూపొందించారు టీం.

పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలై పోస్టర్స్ , గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. అలాగే ఇటీవలే విడుదలైన టీజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ తో దూసుకుపోయింది.ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… పుష్ప2 లో ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడని ఓ వార్త వైరల్ గా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఉన్నాడని సమాచారం. పుష్ప2 లో హీరోను పరిచయం చేస్తూ మొదట్లో కొన్ని డైలాగ్స్ ను పవన్ చెప్పబోతున్నాడంట. కేవలం పవన్ వాయిస్ ఇవ్వబోతున్నాడు దానికి ఆయన కూడా ఒప్పుకున్నారని టాక్…ఇందులో నిజం ఎంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. పుష్ప2 ఆగస్టు 15 థియేటర్లో విడుదల కానుంది.