ఇక ” మజిలీ ” కాంబో లేనట్లేనా.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న చైతు..!

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే ఎన్నో సినిమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు చైతు.ఇక తాజాగా తండేల్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇక దీని తర్వాత ‘విరూపాక్షి’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనన్నట్లు సమాచారం. ఇదెలా ఉంటే…నాగచైతన్య,సమంత కాంబినేషన్ లో వచ్చిన ‘మజిలీ’ సినిమా ఎలాంటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సమంత, నాగచైతన్య మధ్య కెమిస్ట్రీకి ఎంతోమంది ఫిదా అయ్యారు.

శివ నిర్మాణ, నాగచైతన్య కాంబినేషన్ లో మరో చిత్రం వస్తున్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది. దీనితో ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ మరోసారి చూడొచ్చని అంటున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇది క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే…డైరెక్టర్ శివ నిర్మాణ కథ నాగచైతన్య కి అంతగా నచ్చలేదంట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవటంతో… వీరిద్దరి కాంబో ఇక లేనట్లేనా అంటూ ఫ్యాన్స్ నిరుత్సాహా పడుతున్నారు.