మూడు మిలియన్ దిశగా పరుగులు తీస్తున్న టిల్లు గాడు.. మనోడి ఊచ కోత మామూలుగా లేదుగా..!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు రామ్ మల్లిక్ తెరకెక్కించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం” టిల్లు స్క్వేర్” అయితే ఈ చిత్రం కూడా గతంలో వచ్చిన డీజే టిల్లు తరహాలోనే
ఊహించని నంబర్స్ సెట్ చేసి సిద్ధూ కెరియర్ లోనే మాసివ్ హిట్ అయ్యింది.

అలా తన కెరియర్ లో మొదటి 100 కోట్లు క్లబ్ సినిమాగా దీనిని మార్చుకోగా ఇప్పటికీ సినిమా వసూళ్లు డిసెంట్ గా కొనసాగుతూ ఉండడం విశేషం. అయితే ఈ సినిమా మరింత ఆశ్చర్యకరంగా యూఎస్ మార్కెట్ లో భారీ వసూళ్లు నమోదు చేసింది.

ఇలా ఓవరాల్ గా ఈ చిత్రం ఇప్పుడు మూడు మిలియన్ డాలర్స్ మార్క్ ని టచ్ చేస్తే దిశగా దూసుకెళ్తుంది. మొత్తానికి అయితే ఈ చిత్రంతో హీరో సహా మేకర్స్ కూడా ఓ బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నేహా శెట్టి, ప్రియాంక జవాల్కరలు కూడా కనిపించగా అచ్చు, రామ్ మిర్యాల అలాగే భీమ్స్ లు సంగీతం అందించారు.