ప్రభాస్ ” కల్కి ” రిలీజ్ వాయిదా.. కారణం ఇదే (వీడియో)..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. -ఇక తాజాగా తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898AD గురించి తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పై భారీ హైప్స్ ఉన్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 9న రిలీజ్ కానుంది.

పాన్ భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. కల్కిలో ప్రభాస్, దీపిక పదుకొనే తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, పశుపతి వంటి స్టార్ట్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మాస్తునారు. సంతోష్ నారాయణ ఈ సినిమాకి మ్యూజిక్ నీ అందిస్తున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ నిన్నటితో ముగిసినట్లు టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కల్కి 2898 AD సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని జూన్ 20కి వాయిదా వేసినట్లుగా సమాచారం. దీనిపై ఏప్రియల్ 17 న అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.అయితే భారతీయ సినీ చిత్రంలో ఇలా ఓ సినిమాను ప్రమోట్ చేయనుండటం మొదటిసారి కావటం విశేషం.