రాజమౌళి కోసం అలా చేస్తున్న మహేశ్ బాబు.. నిద్ర లేకుండా చేస్తున్నాడే..!

కోట్లాదిమంది మూవీ లవర్స్ కళ్ళు ఇప్పుడు మహేష్ బాబు – రాజమౌళి సినిమా పైన పడి ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతూ ఉండొచ్చు . కానీ ఎక్కువమంది ఈ సినిమా కోసం ఈ కాంబో కోసం వెయిట్ చేస్తూ ఉండడం గమనార్హం. అందుకే ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది . ఈ సినిమా కోసం రాజమౌళి వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే .

అయితే మరీ ముఖ్యంగా మహేష్ బాడీ ఫిజిక్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారట రాజమౌళి . అంతే కాదు ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కోసం ఆయన కొత్త కొత్త అలవాట్లను కూడా మార్చుకుంటున్నారట. తాజాగా స్కేటింగ్ కూడా నేర్చుకుంటున్నాడట . ప్రపంచ సాహసికుడుగా అనేక అడ్వెంచర్స్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో అందుకోసం బాగా ట్రైన్ అవుతున్నారట . మహేష్ బాబు రాత్రి పగలు నిద్ర లేకుండా మార్నింగ్ డైట్ ఆఫ్టర్నూన్ స్కేటింగ్ ఈవినింగ్ వాకింగ్ అంటూ మహేష్ బాబును బాగా పిండేస్తున్నాడట రాజమౌళి . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇండోనేషియన్ నటి చెల్సియా హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు నాగార్జున కీలకపాత్రలో కనిపించబోతున్నారట . అంతేనా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ లో కనిపించబోతున్నారట. మరి ఇంత మంది బడా స్టార్స్ నటిస్తూ ఉండగా ఈ సినిమా గురించి అభిమానులు తక్కువగా ఎలా ఊహించుకుంటారు . ఈ సినిమా కోసం రెండు టైటిల్స్ ని అనుకుంటున్నారట రాజమౌళి. ఒకటి మహారాజా రెండు చక్రవర్తి.. ఫైనల్ గా ఏది పెడతారో వేచి చూద్దాం..!!