నితిన్ వెంకీ కుడుముల మూవీలో విలన్ గా ఆ స్టార్ హీరో.. షాక్ లో ఫ్యాన్స్..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా హీరోగా రాణిస్తున్న వారిలో యంగ్ హీరో నితిన్ ఒకరు. ఈయన చేస్తున్న ప్రతి సినిమా యూత్ లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంటుంది. అలాగే నితిన్‌కి కూడా తన సినిమాల ద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ఇందులో భాగంగానే ఈయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకుంటుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల డైరెక్షన్లో ఓ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా నితిన్‌కు సరైన హిట్ లేకపోవడంతో ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నాడు నితిన్.

Nithin as con man ROBIN HOOD in Venky Kudumula film?

ఈ సినిమాలో తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని టాక్. ఇక గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నితిన్ కు సరైన హిట్ పడలేదు. దీంతో మళ్ళీ ఇదే కాంబో రిపీట్ అయితే బ్లాక్ బ‌స్టర్ అవుతుందని నితిన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తనను తాను మరోసారి ఎలివేట్ చేసుకోబోతున్నారు నితిన్. ఈ క్ర‌మంలో ఈ సినిమాల్లో బాలీవుడ్ హీరో విలన్ గా నటించబోతున్నాడు అంటూ వార్త వైరల్ అవుతుంది.

Bobby Deol - Movies, Biography, News, Age & Photos | BookMyShow

దీంతో ఫ్యాన్స్ అంత ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు యానిమల్ లో విలన్ రోల్ ప్లే చేసిన బాబి డియోల్‌ను నితిన్, వెంకీ కుడిమల కాంబో మూవీలో విలన్ గా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక సినిమా దాదాపు ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి చేసుకుంది. యానిమల్ తో బాబి డియోల్‌కు వచ్చిన పాపులారిటీని ఈ సినిమాలో వీరు యూజ్ చేసుకునే ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా తెర‌కెక్కిన తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి. వెంకీ కుడుముల ఈ సినిమాతో సక్సెస్ కొడితే ఆయన హ్యాట్రిక్ హిట్స్ కొట్టినట్టు అవుతుంది.