తారుమారు అయిన ప్లేసెస్: టాలీవుడ్ టాప్ 10 హీరోలు వీరే.. నెం 1 హీరో ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరో లు ఉన్నా సరే మా హీరో గొప్ప అంటే మా హీరో తోపు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అభిమానులు . మరి ముఖ్యంగా పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా మా హీరోనే నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మా హీరో ఒక్కొక్క సినిమాకి ఎన్ని కోట్లు తీసుకుంటాడు అంటుంటే మా హీరో సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ డప్పు కొట్టుకుంటున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ టెన్ హీరోస్ లిస్ట్ వైరల్ గా మారింది . ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్ మాక్స్ దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అభిప్రాయాలను సేకరించి అందులో టాలీవుడ్ టాప్ టెన్ హీరోలు ఎవరు అని తేల్చేసింది . అయితే అందరూ అల్లు అర్జున్ – చరణ్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు అని భావించారు . కానీ తన సినిమాలు ఫ్లాప్ అవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం నెంబర్ వన్ హీరోగా స్థానం దక్కించుకున్నాడు ప్రభాస్ .

మనకు తెలిసిందే.. ప్రభాస్ – బాహుబలి సినిమా తర్వాత హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది . సలార్ సినిమా హిట్ అయిన అది బాహుబలి రేంజ్ హిట్ అని చెప్పలేము. అయితే బాహుబలి తర్వాత నుంచి ఆయన తన స్థానాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వస్తూ ఉండడం గమనార్హం . రీసెంట్ సర్వేలో కూడా ప్రభాస్ టాప్ 1 లో ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో మహేష్ బాబు చోటు దక్కించుకున్నాడు . ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినప్పటికీ మహేష్ రెండవ స్థానంలో నిలవడం గమనార్హం .

మూడవ స్థానంలో అల్లు అర్జున్.. నాలుగవ స్థానంలో ఎన్టీఆర్ ..ఐదవ స్థానంలో రామ్ చరణ్ చోటు దక్కించుకున్నారు . అంతేకాదు ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఏడవ స్థానంలో నాని ఎనిమిదవ స్థానంలో రవితేజ 9వ స్థానంలో విజయ్ దేవరకొండ పదవ స్థానంలో చిరంజీవి నిలిచారు . ఇలా టాలీవుడ్ టాప్ టెన్ హీరోస్ ల ప్లేసెస్ తారుమరైపోయాయి..!!