డైరెక్టర్గా ఓటీటీలో బ్రహ్మానందం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే.. ?!

టాలీవుడ్ నవ్వుల బ్రహ్మీ బ్రహ్మానందం కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్రహ్మానందం.. తాజాగా నటించిన మూవీ వీరాంజనేయులు విహారయాత్ర. ఇటీవల కాలంలో తెలుగు కామెడీ మూవీస్ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. భామ కలాపం తర్వాత నిర్మాత బి.బాపినీడు, సుధీర్ ఈద‌ర కలిసి ఈ వీరాంజనేయులు విహారయాత్ర సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకుడుగా ఇంటర్వ్యూ ఇవ్వనన్నాడు. ఈ సినిమాలో సీనియర్ న‌టుడు నరేష్‌తో పాటు బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు.

కీడాకోల ఫేమ్ రాగ్ మయూర్, ప్రియా వడ్లమని హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు. రోడ‌ఖ్ ట్రిప్‌ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఇక ఈ సినిమా డైరెక్ట్‌ ఈ టీవీ విన్ యాప్‌లో రిలీజ్ కానుంది. ఇక తాజాగా సినిమా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ పాతకాలంనాటి వ్యాన్ లో గోవాకు ఫ్యామిలీ మొత్తం టూర్ వెళ్తున్నట్లు డిజైన్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో వ్యాన్ పై లగేజీతో పాటు.. అస్థికలకుండా కూడా కనిపించ‌డంతో సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

ABOUT US

గోవా రోడ్‌ ట్రిప్‌లో ఫ్యామిలీకి ఎదురైన ఇబ్బందులు.. కష్టాలు.. ఫన్నీ మూమెంట్స్ అన్ని సినిమాలు కనిపించనున్నయట. వీరాంజనేయులు విహారయాత్రలో బ్రహ్మానందం క్యారెక్టర్ సర్ప్రైజింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీతో బ్రహ్మానందం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక కీడాకోల లాంటి హిట్ సినిమా తరువాత బ్రహ్మానందం, రాగ్‌ మయూర్‌ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ తుది దశ‌కు చేరుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈటీవీ విన్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందట.