NBK 109లో ఆ హాట్ బ్యూటీ అండ్ కాంట్రవర్షీయల్ హీరో..బాబీ ట్వీస్ట్ లకి తట్టుకోగలమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ నటిస్తున్న సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది . ఈ సినిమా కోసం బాబీ బాగానే కష్టపడుతున్నాడు . వాల్తేతు వీరయ్య లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకొని బాబీ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. కాగా ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ కి బ్రేక్ చెప్పుకొని ఉంది.

త్వరలోనే ఎలక్షన్స్ జరగబోతూ ఉండడంతో బాలయ్య ప్రచార కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్నాడు. ఆ కారణంగానే సినిమా షూట్ కి బ్రేక్ చెప్పారు . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ గా మారాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీరౌతేలా కూడా నటించబోతుందట .


ఈ సినిమాలో మరో కాంట్రివర్షియల్ హీరోని కూడా రంగంలోకి దింపబోతున్నాడట బాబి . బాబీ సినిమాలు అంటే చాలా సాఫ్ట్ కధలని చూస్ చేసుకుంటాడు . కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళడు . మరి అలాంటి బాబి ఈ సినిమాలో కాంట్రవర్షియల్ హీరోని ఇన్వాల్వ్ చేయడం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది . అంతేకాదు ఈ సినిమాలో వచ్చే ట్వీస్ట్ లకి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే అంటున్నారు నందమూరి అభిమానులు . చూద్దాం మరి బాలయ్య ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో.. బాబి తన తలరాతను ఎలా మార్చుకుంటాడో..??