జక్కన్న – మహేష్ మూవీలో మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ లుక్ రివిల్.. ఎలా కనిపించనున్నాడంటే..?!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాడు జ‌క్కన. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారింది. ఈ సినిమా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ మూవీలో మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ లుక్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. మహేష్ ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో రగడ్‌ లుక్కుతో కనిపిస్తాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్‌లో ఇలాంటి లుక్‌లో ఎప్పుడు కనిపించలేదన్న సంగతి తెలిసిందే.

Mahesh Babu's Striking New Look Make Heads Turn | Mahesh Babu's Striking  New Look Make Heads Turn

మహేష్ లుక్‌ కొత్తగా ఉంటే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు తన టోటల్ లుక్ ను పూర్తిగా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాడట. విల్లర్ స్మిత్ నవల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోందని.. విజయేంద్ర ప్రసాద్.. మహేష్ పూర్తి ఇమేజ్‌ను మార్చేసేలా కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. రాజమౌళి మహేష్ కాంబో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్‌ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Pics: Mahesh Babu sets hearts afire with his sizzling new look; Keerthy  Suresh reacts | Telugu Movie News - Times of India

సాయి మాధవ్ బుర్ర డైలాగ్ రైటర్ గా ఈ సినిమాకు పని చేస్తున్నారని టాక్. మహేష్, రాజమౌళి కాంబో మూవీ ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుందట. అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాల్లో ఓ హీరోయిన్‌గా నటించే లక్కీ ఛాన్స్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కొట్టేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమా 2026 ఎండింగ్లో రిలీజ్ అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. సినిమాలో యాక్షన్ సీన్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉంటుందని టాక్.