కోట్ల ఆస్తికి ఆశపడే 44 ఏళ్ళ వయసులో 60 ఏళ్ల వ్యక్తికి మెడ వచ్చింది.. అది కూడా 4వ భార్యగా..

సీనియర్ నటుడు నరేష్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ ఫ్యామిలీ మెంబర్గా నరేష్ కు మంచి రెస్పెక్ట్ ఉంది. నరేష్ తల్లి ప్రముఖ నటి విజయనిర్మల, సూపర్ స్టార్ కృష్ణ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా మహేష్ న‌రేష్ కజిన్ బ్రదర్. ఇక ప్రస్తుతం నరేష్ వయసు 64 ఏళ్ళు. నరేష్ సినిమాల్లో సక్సెస్ఫుల్ యాక్టర్ గా రాణిస్తున్నా.. వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఈయన జీవితంలో మూడు పెళ్లిళ్లు చివరకు విడాకులతో ముగిస్తాయి. మొదట సీనియర్ డ్యాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నా నరేష్ ఒక కొడుకు జన్మనిచ్చిన తర్వాత విభేదాలతో విడాకులు తీసుకున్నాడు.

ఆ తర్వాత నరేష్.. రేఖ సుప్రియ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ బంధం కూడా డివర్స్ తో ఎండ్ అయింది. ఆ తర్వాత నరేష్ 50ఏళ్ళ‌ వయసులో రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహ బంధం మరింత సంచలనంగా మారింది. చివరకు వీరికి విడాకులు జరిగాయి. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండ‌గా.. రమ్యతో విడాకులు కాక‌ముందే నరేష్ టాలీవుడ్ స్టార్ నటి పవిత్ర లోకేష్ ను ప్రేమించి రిలేషన్ను కొనసాగిస్తున్నారు. ఈ రిలేషన్ను అఫీషియల్గా గ‌తేడాది అనౌన్స్ చేశారు. ఇది కాస్త రమ్య రఘుపతి తో తీవ్ర వివాదంగా మారింది. అయితే పవిత్ర లోకేష్, నరేష్ నిజంగానే వివాహం చేసుకున్నారా.. లేదా.. సహజీవనం ఇంకా కొనసాగిస్తున్నారా అనే దానిపై క్లారిటీ రాలేదు.

మొత్తానికి వీరిద్దరి బంధం మాత్రం అఫీషియల్ గా మారింది. ఇక నరేష్ వయసు 64, పవిత్ర వయసు 44 ఏళ్ళు సౌత్ లో తల్లి, వదిన, అత్త తరహా క్యారెక్టర్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర.. గతంలోనే వివాహం చేసుకొని విడాకులు తీసుకుంది. ఆమె మాజీ భర్త పేరు సుచేంద్ర ప్రసాద్. ఇక తాజాగా సుచేంద్రప్రసాద్.. పవిత్ర లోకేష్, నరేష్ పెళ్లి గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. కేవలం డబ్బు కోసం పవిత్ర లోకేష్ ఎలాంటి పనైనా చేస్తుందని.. నరేష్‌తో రిలేషన్ లో ఉండడానికి కూడా అదే కారణం అంటూ సుచేంద్ర ప్రసాద్ మాట్లాడాడు. నరేష్ దగ్గర రూ.1500 కోట్ల ఆస్తి ఉందని ఆమెకు తెలుసు. అందుకే అతనితో రిలేషన్‌షిప్ మొదలుపెట్టిందంటూ వివరించాడు. అతని వయసు 60 ఏళ్లు పైబడినా.. పవిత్ర అతనికి 4వ‌ భార్యగా వెళ్లడానికి కారణం ల‌గ్జ‌రీ లైఫ్‌ అంటూ సంచల ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.