“ఇక నన్ను వదిలేయండి..వెళ్లిపోతున్న”..హీట్ పెంచేస్తున్న మెగా కోడలు న్యూ పోస్ట్..!!

సోషల్ మీడియాలో యమ ఆక్టివ్ గా ఉండే మెగా కోడలు లావణ్య త్రిపాఠి . తాజాగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త డౌట్లు వచ్చేలా చేస్తుంది. లావణ్య త్రిపాఠి తనను ట్రోల్ చేసే వాళ్ళకి ఘాటుగా ఇచ్చి పడేసింది అని కొందరు అంటుంటే మరి కొందరు ఆమె పరోక్షంగా తన మనసులోని మాటను బయట పెట్టేసింది అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అందాల రాక్షసి సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి ..టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే .

కొన్ని రోజులు సీక్రెట్ గా గుట్టూ చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లీ జూన్ 9వ తేదీ నిశ్చితార్థం చేసుకొని తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా బయటపెట్టింది . నవంబర్ ఒకటవ తేదీ పెళ్లి చేసుకుని ఇటలీలో కొత్త లైఫ్ ను ప్రారంభించింది . ఎప్పటికప్పుడు ఫ్యామిలీ లైఫ్ లో చక్కగా ఎంజాయ్ చేసే లావణ్య వరుణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పర్సనల్ విషయంగా కూడా బిజీబిజీగా ముందుకు వెళ్తున్నారు.

తాజాగా లావణ్య త్రిపాఠి క్యూట్ గా రెడీ అయి మతిపోగొట్టే రేంజ్ లో డ్రెస్ వేసుకొని లిఫ్ట్ ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ” నేను పైకి వెళ్ళిపోతున్నాను నన్ను వదిలేయండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది “. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది . అయితే ఎవరైతే తనని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఘాటుగా ఇచ్చుపడేసింది. ఇక నన్ను వదిలేయండి రా బాబు అంటూ పరోక్షకంగా కౌంటర్ వేసింది అంటున్నారు మెగా అభిమానులు . లావణ్య త్రిపాఠి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!