రాజమౌళికి ఊహించని షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించనటువంటిది..!

జూనియర్ ఎన్టీఆర్.. ఎంత నాటి ఫెలో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి తర్వాత సైలెంట్ అయ్యాడు కానీ పెళ్లికి ముందు చాలా చాలా అల్లరివాడు . ఈ విషయాన్ని చాలామంది హీరోలు కూడా బయటపెట్టారు . మరి ముఖ్యంగా రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా చనువుగా మూవ్ అవుతూ ఉంటాడు. ఒక డైరెక్టర్ ఒక హీరోకి మధ్య ఉన్న బాండింగ్ కన్నా వీళ్ళ మధ్య ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అని కూడా చెప్పడం చాలా తక్కువే అంతకుమించి ..

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . జూనియర్ ఎన్టీఆర్ని చక్కదిద్దిన ఘనత రాజమౌళిది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . వీళ్ళ కాంబోలో వచ్చిన ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ . ఈ సినిమా ఎలా రాజమౌళి – ఎన్టీఆర్ కెరియర్ను మలుపు తిప్పింది అనే విషయం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . అయితే ఈ సినిమా షూట్ అయిపోయిన తర్వాత సరదాగా ఎన్టీఆర్ తల అల్లరి పనులతో జక్కన్నను విసిగించాడట.

ఈ విషయాన్ని రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. దీనికి సంబంధించిన న్యూస్ను సరదాగా ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. చాలా సరదాగా చిల్ అవుట్ అవుతూ ఉండే ఎన్టీఆర్ – రాజమౌళి టైం వేస్ట్ చేయించాలి అని ఆయనని డిస్టర్బ్ చేయాలి అని సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనతో ఓ ప్రాంక్ చేశారట . బిజీగా ఏదో పని చేసుకుంటున్నా రాజమౌళి ను ఇంటర్నెట్ కేఫ్ లో అత్యంత ముఖ్యమైన పని ఉంది అంటూ పిలిపించి అటు ఇటు మాయమాటలు చెప్పి ఆయన టైం మొత్తం వేస్ట్ చేయించారట. తీరా ఏంటి ఇంపార్టెంట్ పని అనేసరికి ప్రాంక్ అంటూ సరదాగా ఆట పట్టించారట . ఎన్టీఆర్ గురించి తెలిసిన రాజమౌళి సైతం చాలా సరదాగా ఈ సిచువేషన్ తీసుకున్నారు అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. వీరిద్దరి మధ్య ఉన్న చనువుకి బంధానికి ఇది ఓ ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు..!!