నావల్ల కాక రోజు ఏడ్చేదాన్ని.. తెలుగులో ఇదే చివరి సినిమా.. మృణాల్ ఠాగూర్

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాగూర్ కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ప్రస్తుతం క్రేజీ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో తరువాత నాని హాయ్ నాన్న సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో పలు ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సంద‌డి చేస్తుంది మృణాల్‌.

 

ఈ క్ర‌మంలో సీతారామం సినిమా టైమ్ ను గుర్తు చేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మూవీ కోసం టీం సంప్రదించగానే వెంట‌నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని.. సినిమా కోసం మూడు భాషలు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందంటూ వివరించింది. భాష రాకపోతే నటించడం ఎంత కష్టమో నాకు అప్పుడే అర్థమైందని.. తెలుగు రాకపోవడం వల్ల ప్రతిరోజు ఏడ్చేసే దాన్ని అంటూ వివరించింది మృణాల్‌. తెలుగులో డైలాగ్స్ చాలా కష్టంగా ఉండేవని.. ఇంగ్లీషులో రాసుకొని రాత్రంతా ప్రాక్టీస్ చేసి ఆ డైలాగులు చెప్పేదాన్నని.. హిందీ, మరాఠీ కంటే తెలుగులో డబ్బింగ్ కే చాలా కష్టపడ్డాను అంటూ వివరించింది.

ఇక సీతారామం తన చివరి సినిమా అని ఫిక్స్ అయిపోయానని.. షూటింగ్ టైంలో దుల్కర్ సల్మాన్ తో కూడా ఈ విషయాన్ని వివరించానంటూ చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పడంతో.. దుల్కర్ సల్మాన్ నవ్వారని.. ఈ సినిమా తర్వాత నీకు వరుస అవకాశాలు వస్తాయని చెప్పారంటూ వివరించింది. చివరకు ఆయన చెప్పిందే నిజమైంది. సినిమా రిలీజ్ అయ్యాక ఆ కష్టాన్ని మర్చిపోయా. ఇప్పుడు తెలుగు చాలా ఈజీగా మాట్లాడుతున్నా అంటూ మృణాల్ వివరించింది.