మీరాజాస్మిన్ ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో మృతి చెందిన హీరోయిన్ తండ్రి.. !!

ఒక‌ప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) ఇటీవ‌ల కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొన్నాళ్లుగా ఇబంది ప‌డుతున్న ఆయ ఇంట్లోనే చికిత్స తీసుకుంటు మృతి చెందారు. ఈరోజు ఉదయం ఎర్నాకులంలోని ఆయన నివాసంలో జోసెఫ్ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది. మీరా జాస్మిన్ తల్లి ఎలియమ్మ – జోసెఫ్ జంట‌కు నలుగురు పిల్లలు. జోసెఫ్ ఫిలిప్‌కి మీరా చిన్న కూతురూ. మిగతా నలుగురు జీబీ సారా జోసెఫ్, జెనీ సారా జోసెఫ్, జార్జ్, జాయ్. ఇక మీరా జాస్మిన 2001లో లోహితదాస్ దర్శకత్వం తెర‌కె్కిన‌ సూత్రధారన్ మూవీతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాష‌లో చాలా సినిమాల‌లో న‌టించి మెప్పించింది.

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్, తమిళ్ స్టార్ హీరో విశాల్‌కు జోడిగా పందెం కోడి సినిమాల‌లో న‌టించింది. ఈ మూవీస్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్న టైంలో దుబాయ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను 2014లో వివాహం చేసుకున్ని సినిమాల‌కు దూరం అయ్యింది మీరా. ఇక ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ మొదటి నుంచి తన వ్యక్తిగత విషయాలను తన కుటుంబ విష‌యాల‌ను గోప్యంగా ఉంచేందుకు ఇష్ట‌ప‌డుతుంది.

అంతేకాదు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా ఎక్కడా షేర్ చేయదు. మీరా పర్సనల్ లైఫ్, వైవాహిక జీవితం గురించి కూడా చాలా మందికి తెలియదు.పెళ్లైన ఆరేళ్ల తర్వాత మలకల్కు మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన విమానం తో అడియన్స్‌ను ఆక‌ట్టుకుంది. ఈ మూవీలో నటించి.. ఆ తర్వాత మూవీ ప్రమోషన్లలో యాక్టివ్ గా ఉంది. కానీ ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి షేర్ చేసుకోదు. మీరా ప్రస్తుతం ది టెస్ట్ షూటింగ్‌లో పాల్గొంటుంది.