షాకింగ్ : కారు ప్రమాదానికి గురైన హీరో అజిత్.. వీడియో వైరల్..!!

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ప్రస్తుతం వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. 2023లో అజిత్ హీరోగా తెర‌కెక్కిన తొలివ్‌ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఎడ్మిట్ అయ్యారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. కానీ ఆయన జనరల్ చెకప్ కి వెళ్ళినట్లు క్లారిటీ వచ్చేయడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అజిత్ కారు బోల్తా పడిన వీడియో ఒకటి నెటింట‌ వైరల్ గా మారింది. అయితే అదే కారులో నటుడు అరవ్‌ కూడా ఉన్నాడు.

అతని చేతికి బేడీలు వేసి కారు సీటుకు కట్టేసి ఉన్నాడు. ఆయ‌న‌కు ముందే గాయాతుకూడా క‌నిపించాయి. ఇందులో అజిత్ కారును ఫాస్ట్ గా నడుపుతూ వెళ్తుండగా.. కాసేపటికి కారు అదుపుతప్పి బోర్లా పడడం కనిపించింది. ఆ టైంలో అజిత్ కారును కంట్రోల్ చేయాల‌ని ప‌క్క‌కు ఆపేందుకు ప్ర‌య‌త్నించిన అది ఫ‌లించ‌లేదు. ఇక ఈ ప్ర‌మాదం తర్వాత నువ్వు బాగానే ఉన్నావా..? ఏం కాలేదు కదా అని అజిత్ ఆయ‌న‌ను అడిగాడు. అంతలోనే అక్కడున్న వాళ్లంతా పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి వారిని బయటకు తీశారు.

అయితే ఇద్దరికీ ఈ ప్రమాదంలో ఏమీ జరగలేదు. ఇదంతా విడాయుమ‌ర్చి షూటింగ్ కు సంబంధించిన వీడియో అని క్లియర్గా అర్థమవుతుంది. ప్రముఖ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం అది నెట్టింట‌ వైరల్ గా మారడంతో వీడియోను చూసిన వారంతా నిజంగా అజిత్ డెడికేష‌న్‌కు హ్యాట్సాఫ్ అంటూ.. డూప్ లేకుండా ఇలాంటి రిస్కీ స్టాంట్లు చేయడానికి చాలా గట్స్ కావాలి.. అజిత్ రియల్ హీరో అంటూ కామెంట్ చేస్తున్నారు.