విశ్వక్ సేన్ కి అద్దిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వనిది..సో లక్కి..!

జూనియర్ ఎన్టీఆర్.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో ..పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . రీసెంట్గా విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం అందరికీ తెలిసిందే. కాగా విశ్వక్సేన్ జాన్ జిగిడి దోస్త్ సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది .

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ మూవీ టీంకు స్పెషల్ పార్టీ కూడా ఇచ్చాడు . దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి . అయితే ఇక్కడే ఎన్టీఆర్ అలాగే విశ్వక్సేన్ కలిసి దిగిన ఫోటో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ న్యూస్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. విశ్వక్సేన్ కు ఎన్టీఆర్ తన లక్కీ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు అని ..ఎన్టీఆర్ ఇప్పటివరకు తన ఫేవరెట్ వాచ్ ను ఎవరికీ గిఫ్ట్ చేయలేదు అని .. ఫర్ ద ఫస్ట్ టైం విశ్వక్సేనకు మాత్రమే గిఫ్ట్ చేశారు అని .. ఆ కారణంగానే విశ్వక్సేన్ ఇంత హ్యాపీగా ఉన్నాడు అని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ఎన్టీఆర్ మనసుకి దగ్గర అవ్వాలి అంటే చాలా కష్టం .. అలాంటిది విశ్వక్సేన్ దగ్గరయ్యాడు అంటే ఆయనలో ఎంతో మంచితనం ఉండాలి అంటూ ఓ రేంజ్ లో విశ్వక్ సేన్ ను – తారక్ ను పొగిడేస్తున్నారు. ప్రజెంట్ వీళ్లకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీ రిలీజ్ కాబోతుంది . చూద్దాం ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో తారక్..!