ఏసి ఎక్కువగా వాడిన ..తక్కువ కరెంట్ బిల్ రావాలి అంటే .. ఈ చిన్న పని చేయండి చాలు.. మిడిల్ క్లాస్ వాళ్లకి “మనీ” మిగిలించే టిప్..!!

వచ్చేసింది.. మిడిల్ క్లాస్ జనాలకు కడుపు మండిపోయే కాలం వచ్చేసింది . బయట ఎండలు ఎలా భగభగ మండిపోతున్నాయో మనం చూస్తున్నాం . ఉదయం 10 దాటిందంటే చాలు సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చి వేడితో గజగజ వణికించేస్తున్నాడు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లడానికి కూడా చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులను మనం చూస్తున్నాం . ఎప్పుడు కంటే ఎక్కువగా ఈసారి ఎండలు భగభగ మండిపోతూ ఉండడం మనం గమనించవచ్చు.

అయితే ఈ మండే ఎండలకు కచ్చితంగా చల్లని పదార్థాలు తీసుకోవాలని చల్లటి వాతావరణం లో ఉండాలి అని ప్రతి మనిషి బాడీ కోరుకుంటుంది . అందుకే చాలామంది ఎక్కువగా ఈ ఎండాకాలంలో ఏసీలను వాడుతూ ఉంటారు . డబ్బు ఉన్నోళ్ల పరిస్థితి వేరు సెంట్రల్ ఎస్సీ అంటూ 24/7 రన్ అవుతూనే ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ పరిస్థితి చాలా చాలా డిఫరెంట్. ఒక గంట ఏసీ వేస్తేనే కరెంట్ బిల్ పెరిగిపోతది నెలవారీ ఖర్చులకు డబ్బులు తక్కువ వస్తాయి అని ఆలోచించే మైండ్ సెట్ .

మరి అలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు కరెంటు బిల్లు తక్కువగా రావాలి ..అయినా కూడా ఎండాకాలంలో ఏసీ వాడాలి అంటే ఈ చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుంది. చాలామంది రూమ్ లోకి రాగానే చెమటకు తట్టుకోలేక ఏసీ ని 16 లో పెట్టేస్తూ ఉంటారు . కానీ అది తప్పు అలా పెట్టడం వల్ల కూలింగ్ అయితే వస్తుంది కానీ మీకు ఉపయోగపడే విధంగా ఏసీ వర్క్ అవ్వదు. ఫ్యాన్ ని నాలుగో స్పీడ్ లో పెట్టుకొని ఏసీ ని 24 లో పెడితే పది నిమిషాలకి మీ రూమ్ చల్లబడిపోతుంది . తద్వారా మీకు కరెంటు బిల్లు కూడా చాలా చాలా తక్కువగా వస్తుంది.

కొంతమంది రాత్రి మొత్తం ఏసీ రన్ చేసుకుంటూనే ఉంటారు. మరి కొంతమంది నిద్రపోకుండా ఏసీ ని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉంటారు . అది చాలా తప్పు ఏసి అనేది రాత్రి మొత్తం రన్ అవ్వాలి చల్లగా ఉండాలి అనుకుంటే 28లో కానీ 26 లో పెట్టేసి కంటిన్యూగా అదే స్పీడ్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. 26లో పెట్టాము కూలింగ్ ఎక్కలేదు అని గబగబా వెళ్లి 24లోకి 20లోకి మారిస్తే కరెంట్ బిల్ విపరీతంగా పెరిగిపోతుంది .

మొదటి నుంచి ఒకే టెంపరేచర్ మెయిన్టైన్ చేస్తూ ఉంటే సాధారణంగా మనకి ఎంత కరెంట్ బిల్ వస్తుందో అదేవిధంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి . అన్నిటికన్నా ముఖ్యం రోజు మొత్తం కూడా ఏసీలో ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సాయంత్రం పూట చల్లగాలికి తిరగడం మజ్జిగ , ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకుంటూ ఉండడం ఈ ఎండాకాలం ఆరోగ్యానికి ఎంతో మంచిది..!