‘ ఫ్యామిలీ స్టార్ ‘ ఫస్ట్ రివ్యూ.. సినిమా చూసిన దిల్ రాజు భార్య, హీరో ఫాదర్ ఏమన్నారంటే..?!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల నటించిన మూవీ ‘ ఫ్యామిలీ స్టార్ ‘. గీతగోవిందం తర్వాత దర్శకుడు పరుశురామ్‌ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. కుటుంబ కథ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి భారీ పాపులారిటి దక్కించుకుంటున్న దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇక అమెరికాలో ఈరోజు మూవీ ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో హైదరాబాద్‌లో మీడియా వాళ్ళ‌కి, తమ ఫ్యామిలీకి కూడా సినిమా చూపించడానికి సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ముందుగానే విజయ్ దేవరకొండ, దిల్ రాజు ఫ్యామిలీలు సినిమాను చూసాయి. అలా దిల్ రాజు భార్య, విజయ్ దేవరకొండ తండ్రి ఈ సినిమా నుంచి ఇచ్చిన ఫస్ట్ రివ్యూ ఏంటో ఒకసారి చూద్దాం.

Dil Raju Second Wife,పుట్టినరోజు నాడు గ్రాండ్ పార్టీ ఇస్తున్న దిల్ రాజు..  భార్యను పరిచయం చేయడానికేనట! - dil raju reportedly to introduce his wife  tejaswini through his birthday party ...

ఫ్యామిలీ స్టార్ సినిమా చూశాక తన భార్య తేజస్విని హిట్ కొట్టేసారండి.. అని కాంప్లిమెంట్ ఇచ్చినట్లు నిర్మాత దిల్ రాజు వివరించాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఆమె వచ్చిందని.. ఆమె జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆయన వివరించాడు. క్రెడిబుల్ రివ్యూ ఇస్తుందని చెప్పుకొచ్చాడు. అలాగే ఆయన కూతురు బలగం నిర్మాతల్లో ఒకరైన హన్షిత రెడ్డి సినిమాను చూసి విజయ్ దేవరకొండ కిల్డ్ ఇట్ అంటూ దిల్ రాజును హగ్ చేసుకుందని.. వివరించాడు. ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది అని డైరెక్ట‌ర్‌కు కాల్‌ చేసి మరి మాట్లాడిందని ఆయన వివరించాడు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాలో చాలా సన్నివేశాలు తమ జీవితంలో జరిగాయని.. విజయ్ దేవరకొండ, పరుశురామ్ చెప్పుకొచ్చారు.

Vijay Devarakonda's Father Prediction Comes True - ManaTelugu

పెళ్లిచూపులు ముందు వరకు తన బండిలో పెట్రోల్ మీటర్ చూస్తే ముల్లు రెడ్ కలర్ దాటలేదని.. విజయ వివరించిన సంగతి తెలిసిందే. ఎప్పుడైనా తాను రెండు, మూడు వందల రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే పది రోజులు మనల్ని ఎవడు ఏమీ చేయలేడనే ఫీలింగ్ ఉండేదని.. పరుశురాం వివరించాడు. మిడిల్ ఫ్యామిలీ పర్సన్స్ ప్ర‌తి ఒక‌రు తమ బయోపికే అనుకుంటారని మేకర్స్‌ వివరించారు. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ ఈ సినిమాను చూసి దిల్ రాజు బయోపిక్ లా ఉందని చెప్పుకొచ్చాడట. ఆ విషయాన్ని స్వయంగా దిల్ రాజు వివరించారు. విజయ్ దేవరకొండ తమ్ముడు.. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసి ఎంటర్టైన్మెంట్ చాలా నచ్చిందని వివరించాడు. ఇక డైరెక్టర్ మాట్లాడుతూ సినిమాలో హీరో, హీరోయిన్లు క్యారెక్టర్జేషన్ గురించి చాలా రోజులు మాట్లాడుకుంటారని వివరించాడు.