‘ మా ‘ బిల్డింగ్ ఈవెంట్‌కు రండి అంటూ ప్రభాస్‌కు ఆహ్వానం.. ప్రభాస్ సమాధానం తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఆయన.. వ్యక్తిగతంగాను అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఓ వ్యక్తిగ ప్రభాస్ ది సాయం చేయడంలో పెద్ద చెయ్యి. ఆయన్ను సహాయం కోసం ఆశ్రయించిన వారు ఎవరికైనా తప్పక ఫలితం ఉంటుంది. అలాగే దేశంలో ఏ విపత్తు వచ్చినా, ఏ ప్రమాదం జరిగిన సెలబ్రిటీస్ అంతా అలాంటి ప్రజల కోసం సహాయం చేస్తూ ఉంటారు. అలా సహాయం చేసే వారిలో కూడా ప్రభాస్‌దే ఎప్పుడు పై చేయిగా ఉంటుంది. ప్రభాస్ స్వతహాగా రాజుల ఫ్యామిలీ కావడంతో.. ఆయన చేసే సహాయం కూడా అదే రేంజ్ లో ఉంటుందని కొందరు వ‌ర్ణిస్తారు.

Sivaji Raja suggests solution to end controversies in MAA  association-Telangana Today

ప్రభాస్ చేయకి నరం లేదని.. ఆయన సహాయంలో అసలు వెనకాడని అంటూ ఉంటారు. ఇలాంటి ఓ సందర్భాం ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ సారి సాయం కోసం నటుడు శివాజీ రాజా ప్రభాస్ ఇంటికి వెళ్ళాడట. శివాజీ రాజా గతంలో ఎన్నో సినిమాలకు హీరోగా, ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆయన మా అధ్యక్షుడిగా రెండు టర్మ్‌ల‌లో వ్యవహరించాడు. ఇక ఆ సమయంలో మా బిల్డింగ్ ఫండ్ రైజింగ్ కోసం పలు ఈవెంట్లను ఏర్పాటు చేశాడు. మొదట ఆ ఈవెంట్‌ను అమెరికాలో చిరంజీవితో చేయించుగా అది బాగా సక్సెస్ అయ్యింది. తర్వాత మహేష్ బాబు, నాగార్జున, మోహన్ బాబు, జయసుధ లాంటి వారితోను ఈవెంట్లను ప్లాన్ చేశాడు శివాజీ.

Chiranjeevi - Prabhas : చిరంజీవి కోటి ఇస్తానంటే.. ప్రభాస్ రెండు కోట్లు  ఇస్తా అన్నాడు.. శివాజీ రాజా కామెంట్స్ | Shivaji raja comments about  chiranjeevi and prabhas-10TV Telugu

అయితే మహేష్ బాబు ఆ ఈవెంట్ కు ఓకే చెప్పినా తర్వాత.. నరేష్ చెడగొట్టాడని.. అది అప్పట్లో పెద్ద రచ్చ జరిగిందని శివాజీ రాజా వివరించాడు. అదే సమయంలో ప్రభాస్ కోసం ఈవెంట్ ని ప్లాన్ చేశారట. ఆయన్ను ఆహ్వానించేందుకు ఇంటికి వెళ్ళగా.. ప్రభాస్ ఈవెంట్ గురించి మొత్తం విని.. నేను వస్తే ఎంత వస్తుంది అని అడిగాడట. దానికి శివాజీ రాజా ఓ రెండు కోట్ల వరకు వస్తుంది అంటూ చెప్పడంతో.. మీరు ఎందుకు అనవసరంగా అంత స్ట్రెయిన్‌ ఫీల్ అవ్వడం. నేనే ఆ రెండు కోట్లు ఇచ్చేస్తాను లేండి అంటూ చెప్పాడట. ప్రభాస్ చెప్పిన ఆ సమాధానానికి శివాజీ రాజా తో పాటు అతనితో వెళ్లిన టీంకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది.

Prabhas talks about his share - Telugu Rajyam

ప్రభాస్‌ది పెద్ద చెయ్యి అనడంలో ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. ఆయన సినిమా షూటింగ్ లోను అందరితో ఎంతో కలిసిమెలిసి ఉంటూ అందరికీ తన ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని రుచి చూపిస్తూ ఉంటారు. అందుకే ప్రభాస్‌తో పని చేసే ప్రతి ఒక్కరూ ఆయన ఇంటి నుంచి తెప్పించే భోజనాల గురించి ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ స్టార్ గా రాణిస్తున్న ప్రభాస్ కల్కి 2898 ఏడి, రాజా సాబ్, స్పిరిట్ ఇలా వరుస సినిమా షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.