ఎట్టకేలకు ప్రియుడితో సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ క్లారిటీ.. పెళ్ళి వీడియో వైరల్..

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సి ఇటీవల వివాహ జీవితంలోకి అడుగు పెట్టింది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాదియాస్ బోన్‌తో దాదాపు 16 ఏళ్లకు పైగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా అతనిని వివాహం చేసుకుంది. రాజస్థాన్, ఉదయపూర్ లో మార్చ్ 23న ఈమె వివాహం జరిగినట్లు సమాచారం. ఈ వివాహ వేడుకలకు కేవలం ఇరు కుటుంబాలు, అతి దగ్గర బంధుమిత్రులు మాత్రమే పాల్గొన్నారు. త‌మ పెళ్ళి విష‌యాని ఈ జంట చాలా సీక్రెట్‌గా ఉంచారు.

Taapsee Pannu | Taapsee Pannu pairs trench coat with fusion sari: Top Instagram moments - Telegraph India

ఇక తాజాగా తాప్సి పెళ్లి ఫోటోలను కనిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. దానికి మేరే యార్‌కి షాది అన్న హ్యాష్ ట్యాగ్‌ జత చేసి పోస్ట్ చేసింది. అయితే పెళ్ళి తర్వాత తాప్సి మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈశారి తో ఈ బంధం కలకాలం అలాగే ఉంటుందని ఆశిస్తున్న అంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకొని దిగిన ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Wedding Bells or Saree Spells? - Taapsee Stuns

దీంతో తాప్సి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని అభిమానులు అంతా విషెస్ తెలియజేశారు. ఇక తాజాగా తాప్సి పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింటి వైరల్ గా మారింది. పెళ్లికూతురుల రెడీ అయిన ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ చేస్తూ కాబోయే వరుడు వద్దకు వెళ్ళింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజ‌న్స్‌ అంతా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా సింపుల్ గా తాప్సి పెళ్లి చేసుకుని అంద‌రికి షాక్ ఇచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు.