టిల్లు స్క్వేర్ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారెందుకు చాలా మంది శ్ర‌మిస్తూ ఉంటారు. అయితే మొదట్లో ఎన్నో సినిమాలతో ఫ్లాపులు ఎదురైనా.. ఒకే ఒక్క సినిమా హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయిన వారు కూడా ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. సూర్యదేవర నాగా వంశీ ప్రొడ్యూసర్గ వ్యవహరించిన డిజేటిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించగా.. వంశీకృష్ణ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్‌ల‌ వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవ‌ల‌ మార్చి 29, 2024న ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రిలీజై ప్రేక్షకులను అదే రేంజ్‌లో ఆకట్టుకుంది. హోమ్లి బ్యూటీగా పాపులారి దక్కించుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. అయితే అప్పటివరకు ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకున్న అనుపమ ఈ సినిమాల్లో ఒక్కసారిగా బోల్డ్ కంటెంట్ తో కనిపించడంతో పలు ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాకు మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. డీజే టిల్లును మించి కలెక్షన్ల వర్షం కురిపించింది.

Netflix | Brand Assets | Logos

బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం భారీ బుకింగ్ తో దూసుకుపోతుంది. ఇక తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇక ఈ సినిమా ఓటీటీలో ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొద‌టి వారంలో స్ట్రీమింగ్ అవుతోందని సమాచారం. అయితే టిల్లు స్క్వేర్ ఓటీటీ ప్లాట్‌ఫాం.. అసలు రిలీజ్ డేట్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.