దేవర లో ఆ యంగ్ హీరో.. పిక్స్ తో గూస్ బంప్స్ న్యూస్ ప్రకటించిన విశ్వక్ సేన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులర్టీ సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు నందమూరి అభిమానులు . ఈ సినిమా ద్వారా తెలుగులో డేబ్యూ ఇవ్వబోతుంది అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ . ఈ సినిమాతో తన లక్ ని పరీక్షించుకోబోతుంది .

ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా అభిమానులను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ సినిమాలో హీరో విశ్వక్సేను కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . అయితే రీసెంట్గా హీరో సిద్దు జొన్నల గడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తుంది .

ఈ పార్టీకి సిద్ధూ జొన్నలగడ్డ బెస్ట్ ఫ్రెండ్ విశ్వక్సేన్ కూడా హాజరైనట్లు తెలుస్తుంది . అంతేకాదు టిల్లు స్క్వేర్ నిర్మాత నాగవంశీ ఈ పార్టీకు వచ్చాడు. ఇందులో అనిరుద్ పాడిన పాటలను కూడా ప్లే చేశారట . విశ్వక్సేన్ ఇదే విషయాన్ని తెలుపుతూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు . ఎన్టీఆర్ తో చాలా చాలా సన్నిహితంగా హగ్ చేసుకుని ఉండే టైప్లో ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ ..”దేవరా మ్యూజిక్ ఉందమ్మా నెక్స్ట్ లెవెల్ అంతే ..అనిరుధ్ ఇరగొట్టేశాడు.. ఈ ఆల్బమ్ ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది ” అంటూ రాసుకొచ్చాడు . దీంతో ఫాన్స్ ఈ సినిమా పై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాలో నిజంగానే విశ్వక్సేన్ ఉన్నాడా..? లేకపోతే వేరే ఎవరైనా యంగ్ హీరో ఆ ప్లేస్లో నటిస్తున్నాడా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది . చూడాలి మరి ఎన్టీఆర్ – విశ్వక్సేన్ ను ఓకే స్క్రీన్ పై చూడాలి అని అనుకుంటున్నా అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..???

 

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)