కత్తి లాంటి మగాళ్లు వెంట పడినా..కాజల్ ఎందుకు గౌతమ్ కిచ్చులునే పెళ్లి చేసుకుందో తెలుసా..?

కాజల్ అగర్వాల్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల చందమామగా పాపులారిటీ సంపాదించుకుంది . నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాలో చాలా చాలా ట్రెడిషనల్ గా కనిపించింది అంటూ జనాలు షాక్ అయ్యారు . అయితే రెండో సినిమాకి తనలోని బోల్డ్ యాంగిల్ ను బయటపెట్టి కుర్రాళ్లకు దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . కాగా కెరియర్ పిక్స్ లో ఉండగానే తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్చులు ని పెళ్లి చేసుకుంది . వెంటనే నీల్ కిచ్చులుకు కూడా జన్మనిచ్చేసింది . కత్తిలాంటి మగాళ్లు ఎంతమంది వెంటపడినా సరే కాజల్ అస్సలు చెల్లించలేదు . దానికి కారణం ఇండస్ట్రీలో ఉండే హీరోలను పెళ్లి చేసుకోకూడదు అంటూ ముందే డిసైడ్ అయిందట.

ఒక హీరోని ప్రేమించి మోసపోయిందట. ఆ తర్వాత అలాంటి మోసాలకు బలవ్వకుండా కాజల్.. తన చిన్న నాటి ఫ్రెండ్ గౌతమ్ నే పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ లైఫ్ ను బిందాస్ గా ముందుకు తీసుకెళ్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోను రయ్ రయ్ అంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. చూద్దాం ఈ ముద్దుగుమ్మ ఏ రేంజ్ లో ఇంకా అల్లాడిస్తుందో..?