ఆ క్రేజీ సీక్వెల్ లో లావణ్య త్రిపాఠి.. మెగా కోడలు బిగ్ రిస్క్ చేస్తుందే..?

లావణ్య త్రిపాఠి.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతున్న పేరు . ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్గా రాజ్యమేలేసిన లావణ్య త్రిపాఠి .. రీసెంట్ గానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . దీంతో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో పాపులారిటీ కూడా దక్కించుకుంది. లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా కోడలుగా రాజ్యం ఏలేస్తుంది.

 

ఒకప్పుడు రాని అవకాశాలు కూడా ఇప్పుడు లావణ్య త్రిపాఠి కు పరుగు పరుగున వచ్చి చేరుతున్నాయి. రీసెంట్గా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి త్వరలోనే క్రేజీ సీక్వెల్ నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆమె తెరంగేట్రం చేసిన అందాల రాక్షసి సినిమాకు సీక్వెల్ రాబోతుందట . నవీన్ చంద్ర – రాహుల్ రవీంద్రన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన లావణ్య త్రిపాఠి చాలా క్యూట్ లుక్స్ లో ఆకట్టుకునింది .

కధా.. కంటెంట్ వైజ్ అభిమానులను బాగా మెస్మెరైజ్ చేసింది . ఈ సినిమాకి ఎప్పటినుంచో సీక్వెల్ రావాలి అంటూ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఫైనల్లి ఇన్నేళ్లకు వాళ్ల కోరిక తీరబోతుంది. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . అయితే పెళ్లి తర్వాత నువ్వు ఇలాంటి ప్రాజెక్టుల్లో నటిస్తే మెగా ఫ్యామిలీ పరువు పోతుంది అని రిస్క్ చేయొద్దు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం మరి లావణ్య త్రిపాఠి ఏం చేస్తుందో..?