ఎన్టీఆర్ నోరు తెరిస్తే ముందు వచ్చే ఊతపదం ఇదే.. మీరు గమనించారా..!

సాధారణంగా ఊతపదం అంటూ ఒకరికి కచ్చితంగా ఉంటుంది . మనలో చాలామంది కూడా ఒక పదాన్ని పదేపదే ఎక్కువగా తరచుగా మనకు తెలియకుండా మనమే వాడుతూ వస్తూ ఉంటాం. కేవలం సామాన్య జనాలే కాదు .. స్టార్ సెలబ్రెటీస్ కి కూడా ఊత పదం ఉంటుంది . ప్రెసెంట్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఊతపదం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ..

ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . మధ్యలో బాలీవుడ్ లో విలన్ షేడ్స్ లో వార్ 2 సినిమాలో కూడా నటించబోతున్నాడు . అయితే ఎన్టీఆర్కు ఎక్కువగా ఒక పదం వాడే అలవాటు ఉందట . అదే “అరె నీ”..ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్టీఆర్ ఈ పదాన్ని కనీసం వందసార్లకు పైగానే వాడుతాడట .

పిల్లల దగ్గర నుంచి ఆయన సినిమాలు చేసే షూట్ వరకు కుటుంబ సభ్యులు అందరితోనూ మాట్లాడే మూమెంట్లో ఈ పదాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారట . తనకి తెలియకుండా ఆ పదం అలా అలా వచ్చేస్తూ ఉంటుందట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు ఎన్టీఆర్ . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంత పెద్ద హీరోకి ఇలాంటి ఊత పదం ఉండటం విచిత్రంగానే ఉంది అంటున్నారు అభిమానులు..!!