వార్నీ.. ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు త్రాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. అవేంటంటే..?!

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలామంది తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. ఇలా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు.. ఎన్నో రకాల ఆరోగ్య విధానాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందులో ఉదయం లేవగానే పరగడుపున గ్లాసుడు మంచినీళ్లను తాగుతూ ఉండే అల‌వాటు ఒక‌టి. అలా ఉద‌యానే ఓ గ్లాస్ నీళ్ళు తాగితే చాలా ఫలితాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతారు. అయితే కొంతమందికి బ్రష్ చేయకుండానే నీరు తాగే అలవాటు ఉంటుంది. అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఉదయం నిద్ర లేచి బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. ప్రతిరోజు నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా నీళ్లు తాగడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియాలు.. లాలాజలం ద్వారా ఉదరంలోకి వెళ్తాయి. అక్కడ ఉండే అధిక ఆమ్ల కంటెంట్ వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. కనుక బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల ఎలాంటి హాని జరగదని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. బ్రష్ చేయకుండా నీరు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది.

నోటి దుర్వాసన సమస్యకు కూడా ఇది చెక్ పెడుతుంది. అలాగే బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల జుట్టు బలంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అలానే ముఖం చర్మానికి అద్భుతమైన గ్లో ఇస్తుంది. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారు ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయకుండా నీరు తాగితే స్థూల కాయం సమస్యలు క్రమబద్ధంగా తగ్గుతూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే మలబద్ధకం, ఎసిడిటీ లాంటి సమస్యలకు ఈ అలవాటు చెక్ పెడుతుంది. క్యావిటీస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు రెగ్యులర్గా బ్రష్ చేసే ముందు నీళ్లు త్రాగడం మంచిది ఈ కారణంగా వేగంగా బరువు తగ్గవచ్చు.